EPFO Interest Amount: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఈ ఏడాది అంటే 2022 కు సంబంధించి పీఎఫ్ వడ్డీ లెక్కలు పూర్తయ్యాయి. త్వరలో ఖాతాదారుల ఎక్కౌంట్లో వడ్డీ జమ కానుంది. ఈపీఎఫ్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్ఓకు చెందిన 7 కోట్ల ఖాతాదారులకు త్వరలో గుడ్‌న్యూస్ అందనుంది. ప్రభుత్వం త్వరలోనే ఈపీఎఫ్‌ఓ ఎక్కౌంట్ హోల్డర్స్ ఖాతాల్లో 2022 ఆర్ధిక సంవత్సరపు వడ్డీ జమ చేయనుంది. పీఎఫ్ ఖాతాదారులకు ఈసారి 8.1 శాతం చొప్పున వడ్డీ లభించనుంది. 2022 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ ఖాతాల వడ్డీ లెక్కలు పూర్తయ్యాయి. త్వరలోనే ఖాతాదారులకు సంబంధిత వడ్డీ మొత్తం జమ కానుంది. ప్రభుత్వ ఖాతాల్లో మొత్తం 72 వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు బదిలీ కానుంది. 


వడ్డీ ఎప్పుడు జమ కానుంది


గత ఏడాది పీఎఫ్ ఖాతా డబ్బులపై వడ్డీ కోసం 6-8 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. కానీ ఈసారి ఆలస్యం చేయడం లేదు. మీడియా నివేదికల ప్రకారం జూన్ 16 వరకూ వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈసారి వడ్డీ 40 ఏళ్లలో అత్యల్పంగా ఉంది. 


మీరు మీ పీఎఫ్ ఎక్కౌంట్ డబ్బుల బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చి తెలుసుకోవచ్చు. ఆ తరువాత ఈపీఎఫ్ఓ నుంచి మెస్సేజ్ ద్వారా బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. ఇక్కడ కూడా మీ యూఏఎన్ నెంబర్, పాన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ అవడం తప్పనిసరి. ఇక ఆన్‌‌లైన్ ద్వారా కూడా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ఈపీఎఫ్ఓ వెబ్‌‌సైట్ epfindia.gov.in సందర్శించాలి. ఈ పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో passbook.epfindia.gov.inకు వెళ్లాలి. ఇప్పుడు మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి. అన్ని వివరాలు నమోదు చేసిన తురవాత కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అందులో మెంబర్ ఐడీ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ కన్పిస్తుంది. 


ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ చెక్


మీ యూఏఎన్ నెంబర్ ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్టర్ అయుంటే..పీఎఫ్ బ్యాలెన్స్‌ను మెస్సేజ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు 7738299899 నెంబర్‌కు EPFOHO టైప్ చేసి పంపించాలి. వెంటనే మీ నెంబర్‌కు మెస్సేజ్ ద్వారా వివరాలు వస్తాయి.


Also read: Flipkart Offer: ల్యాప్‌టాప్స్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. సగం కన్నా తక్కువ ధరకే ఆసస్ వివోబుక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook