Cheque Bounce Rules: చెక్ బౌన్స్ అనేది ఓ నేరం. చెక్ బౌన్స్ అయినప్పుడు పెనాల్టీగా డబ్బులు కట్ అయిపోతుంటాయి. చెక్ బౌన్స్ వ్యవహారాల్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ కొత్త నియమాలు రూపొందిస్తోంది. చెక్ బౌన్స్ అయితే..చెక్ జారీ చేసినవారి ఇతర ఎక్కౌంట్ల నుంచి డబ్బులు కట్ అవనున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెక్ బౌన్స్ ఇకపై మరింత కఠినం కానుంది. చెక్ బౌన్స్ అయితే ఆ వ్యక్తికి చెందిన ఇతర ఎక్కౌంట్ల నుంచి డబ్బులు కట్ కావడం, కొత్త ఎక్కౌంట్ ఓపెన్ చేయకుండా నియంత్రించడం వంటి నిబంధనలు తీసుకొచ్చేందుకు ఆర్ధిక మంత్విత్వ శాఖ యోచిస్తోంది. చెక్ బౌన్స్ కేసులు పెరుగుతుండటంపై ఇటీవలే ఉన్నత స్థాయి భేటీ జరిగింది. ఇందులో చాలా ప్రతిపాదనలు వచ్చాయి. చట్టపరమైన చర్యలు కూడా పెరగవచ్చు. చెక్ బౌన్స్ అయినప్పుడు ఆ వ్యక్తి ఖాతాలో తగిన డబ్బుల్లేకపోతే..అదే వ్యక్తికి చెందిన మరో ఖాతా నుంచి డబ్బులు కట్ చేయవచ్చు.


చెక్ జారీ చేసినవారి ఇతర ఖాతాల్లోంచి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా మరో ప్రతిపాదన ఉంది. చెక్ బౌన్స్  వ్యవహారాల్ని కోర్టు పరిధిలో తీసుకురావచ్చు. శిక్ష కూడా విధించవచ్చు. చెక్ జారీ చేసిన నగదుకు రెండింతలు జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. 


Also read: Tap Heater: పదివేలతో గీజర్ కొనేబదులు..12 వందలతో ట్యాప్ హీటర్ కొంటే చాలు, సెకన్లలో వేడెక్కనున్న నీళ్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook