Chicken Price: కొన్ని రోజుల కిందటి వరకు రూ.300కు పైగా ధర పలికిన కోడిమాంసం ఇప్పుడు అమాంతం పడిపోయింది. శ్రావణమాసం సందర్భంగా చాలా మంది మంసానికి దూరంగా ఉండడంతో ఒక్కసారిగా డిమాండ్‌ తగ్గిపోవడంతో ధరలు భారీగా తగ్గాయి. 10-15 రోజుల కిందట వరకు కోడి ధర భారీగా పలికింది. మొన్నటి దాకా కిలో కిచెన్‌, కొత్తిమీర మసాలాకే రూ.500 ఖర్చయ్యేది. ఇప్పుడు చికెన్‌ ధర రూ.150కి తగ్గింది. ఇక లైవ్‌ కోడి అయితే రూ.80 నుంచి రూ.100లోపే ధర ఉండడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి ఉంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Group 1 Mains: అభ్యర్థులకు అలర్ట్‌.. తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌లో కీలక మార్పు


కొన్ని నెలలుగా ఆకాశన్నంటిని కోడి మాసం ధరలు దిగిచ్చాయి. గత నెలలో కిలో చికెన్‌ రూ.280 నుంచి రూ.300 వరకు పలికింది. కొన్ని చోట్ల అయితే రూ.350కి కూడా చేరింది. ధరను చూసి ప్రజలు బెంబేలెత్తారు. కిలో తెచ్చుకునే చోట అర్ధకిలో తెచ్చుకుని తిన్న పరిస్థితులు. అలాంటిది ఇప్పుడు రూ.300కే కిలోన్నర చికెన్‌ వస్తుండడం విశేషం. ఆషాఢ మాసం కావడంతో హైదరాబాద్‌ వ్యాప్తంగా నెల రోజులు బోనాలు సంబరంగా జరిగాయి. ఈ సమయంలో మాంసానికి విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. దీంతో ఆ నెల రోజులు మాంసం ధర భారీగా పెరిగింది.

Also Read: Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకం


అలాంటి కోడిమాంసం ధర ఈ నెల ఆరంభం నుంచి తగ్గడం ప్రారంభమైంది. ఆషాఢం ముగిసి శ్రావణమాసం రావడంతో చాలా మంది పూజలు, వ్రతాలు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఉపవాసాలు ఉంటున్నారు. శ్రావణమాసాన్ని పవిత్రంగా భావిస్తుండడంతో ఈనెల రోజులు దాదాపుగా మాంసానికి దూరంగా ఉంటారు. చాలా మంది మాంసానికి దూరంగ జరగడడంతో ఒక్కసారిగా చికెన్‌ ధరలు తగ్గిపోయాయి. 


ఈనెల మొదటి వారం నుంచే చికెన్‌ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఆగస్టు 5న కిలో రూ.180 ఉన్న చికెన్‌ ధర.. ఆగస్టు 11వ తేదీకి రూ.150కి పడిపోయింది. ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది. శ్రావణమాసంలో ఆదివారాలు కూడా మాంసం తినడం లేదు. శుభకార్యాలు ఉన్నా కూడా శ్రావణమాసం సందర్భంగా శాఖాహారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా చికెన్‌ దుకాణ నిర్వాహకులు ఈగలు, దోమలు కొట్టుకుంటూ కూర్చుంటున్నారు. గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. 


అయితే ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రావణమాసం ముగిసిన తర్వాత చికెన్‌ మార్కెట్‌కు మళ్లీ కళ వస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో శుభకార్యాలు అత్యధికంగా ఉండడంతో ఫంక్షన్లతోపాటు నిత్యం ఉండే గిరాకీ ఉంటుందని చికెన్‌ వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter