Redmi 10A Launch: రెడ్‌మి నుంచి మరో కొత్త ఫోన్, రేపే ఇండియాలో లాంచ్, ధర ఎంతంటే..??
Redmi 10A Launch: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. అది కూడా అద్భుత ఫీచర్లతో..అతి తక్కువ ధరతో. ఆ కొత్త ఫోన్ గురించి తెలుసుకుందాం.
Redmi 10A Launch: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. అది కూడా అద్భుత ఫీచర్లతో..అతి తక్కువ ధరతో. ఆ కొత్త ఫోన్ గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా విస్తరిస్తున్నది..కన్పిస్తున్నది రెడ్‌మి ఫోన్లు. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఫోన్లు మార్కెట్‌లో ఎక్కువ వాటాను ఆక్రమిస్తున్నాయి. ఇప్పుడు రెడ్‌మి మరో కొత్త ఫోన్ లాంచ్ చేస్తోంది. అది రెడ్‌మి 10ఏ. రెడ్‌మి 10ఏ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేసేది నిర్ధారణైపోయింది. ఇందులో అద్భుతమైన ఫీచర్లున్నాయి. ఫీచర్లు బాగున్నాయి కదా అని ధర ఎక్కువగా ఉంటుందనుకోవద్దు. మార్కెట్ క్యాప్చరింగ్ కోసం కంపెనీ అద్భుత ఫీచర్లతో పాటు అతి తక్కువ ధరకు ఈ ఫోన్ అందిస్తోంది. ఆ ఫీచర్లు, ధర ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 20, 2022న రెడ్‌మి 10 ఏ లాంచ్
రెడ్‌మి 10ఏ లాంచ్ డేట్ తెలిసిపోయింది. ఇక మార్కెట్‌లో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారంతా. ఎందుకంటే అద్భుతమైన ఫీచర్లతో పాటు అతి తక్కువ ధరకు లభిస్తుండటమే. అమెజాన్ ఇండియా ద్వారా ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా లభిస్తాయి. రెడ్‌మి 10 ఏ ధర ఎంతనేది ఇంకా కంపెనీ నిర్ణయించలేదు కానీ ధర మాత్రం చాలా తక్కువ ఉంటుందని ఇప్పటికే సంకేతాలున్నాయి. రెడ్‌మి 10 ఏ 3 జీబీ ర్యామ్ , 32 జీబీ స్టోరేజ్ మోడల్ కేవలం 8 వేల 999 రూపాయలుండవచ్చని అంచనా. అదే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ 9 వేల 999 రూపాయలుండవచ్చని తెలుస్తోంది. ఈ ధరలు అంచనాలే అయినా దాదాపుగా ఇవే ఉండవచ్చు.
రెడ్‌మి 10 ఏ ప్రత్యేకతలు
ఈ మోడల్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. ఇండియాలో మాత్రం రేపు అంటే ఏప్రిల్ 20న లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌పోన్ ఆండ్రాయిడ్ 11 పై పనిచేసే 6.53 ఇంచెస్ హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 720/1600 పిక్సెల్ రిసొల్యూషన్ ఉంటుంది. ఈ ఫోన్‌లో ఫ్రంట్ కెమేరా 5ఎంపీ, బ్యాక్ కెమేరా 13 ఎంపీ ఉంటుంది. ఇక రెడ్‌మి 10ఏ మీడియాటెక్ హెలియో జీ25 ప్రోసెసర్‌పై పనిచేస్తుంది. ఇందులో మీకు 4 జీబీ ర్యామ్, 64 జీబీ వరకూ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్ 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది. 10వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
Also read: Laptops under Rs 30000: HP, Lenovo వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు రూ.30వేల లోపే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook