Branded Budget Laptops in India under Rs 30000: కొవిడ్ (Covid-19) వచ్చినప్పటి నుంచి గత రెండేళ్లుగా ఇంటి నుంచి పనిచేస్తున్నారు ఉద్యోగులు. అంతేకాకుండా విద్యార్థులు ఆన్ లైన్ చదువులకు అలవాటు పడ్డారు. దీంతో ల్యాప్‌టాప్‌లకు (Laptops) డిమాండ్ పెరిగింది. దీంతో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌ల గురించి చాలా మంది నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. రూ.30వేల లోపు కూడా మంచి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లను (Laptops Under Rs 30000) పొందవచ్చు.
Lenovo IdeaPad 1 Celeron Dual Core Laptop
ఈ లెనోవా ల్యాప్‌టాప్ ధర రూ.28,990. ఇది యాంటీ-గ్లేర్ కోటింగ్‌తో 11.6-అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లేను పొందుతారు. ఇది విండోస్ 11 (Windows 11)తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 4GB RAM, 256GB SSD స్టోరేజీ కలిగి ఉంటుంది. దీనితోపాటు మీకు USB టైప్-A పోర్ట్, మైక్రో SD కార్డ్ రీడర్ మరియు HDMI పోర్ట్ కూడా ఇవ్వబడుతుంది. ఈ ల్యాప్ టాప్ ఛార్జ్ చేయకుండా ఎనిమిది గంటల పాటు పని చేస్తుంది.
Asus VivoBook 14 Pentium Silver Laptop
ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 28,990. మీకు 14-అంగుళాల ఫుల్ హెచ్‌డీ, యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే లభిస్తుంది. చాలా తేలికైన, అందమైన ఈ ల్యాప్‌టాప్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ మరియు విండోస్ 11 హోమ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4GB RAM, 256GB SSD స్టోరేజీ సదుపాయం ఉంది. MS Office సపోర్టు చేస్తుంది. దీంతోపాటు USB మరియు HDMI పోర్ట్‌లను కూడా పొందుతారు.
HP 247 G8 Laptop
ఈ HP ల్యాప్‌టాప్ ధర రూ.29,990. 8GB RAM, 1TB HDD స్టోరేజీ సదుపాయం ఉంది. 14-అంగుళాల HD, యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే లభిస్తుంది. Windows 11 హోమ్ సపోర్ట్ చేస్తుంది. USB టైప్-A పోర్ట్, USB టైప్-C పోర్ట్ మరియు HDMI పోర్ట్ కూడా కనెక్టివిటీ కోసం ఇవ్వబడ్డాయి.
Also Read: Laptop Blast in AP: పనిచేస్తుండగా పేలిన ల్యాప్‌టాప్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి తీవ్ర గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook