Credit Score : సాధారణంగా మీరు బ్యాంకుల నుంచి రుణాలను పొందాలంటే బ్యాంకులు మీ సిబిల్ స్కోర్ ను చెక్ చేస్తూ ఉంటాయి. సిబిల్ స్కోర్ కనుక సరిపడా ఉన్నట్లయితే, మీకు సులభంగా రుణం లభిస్తుంది. అది కూడా తక్కువ వడ్డీ రేటుకి రుణాలు లభించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీ సిబిల్ స్కోర్ ఎనిమిది వందల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా రుణం లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిబిల్ స్కోర్ అనేది మీరు తిరిగి రుణం చెల్లిస్తారా లేదా అని సూచించే అర్హత సూచిక అని చెప్పవచ్చు. సిబిల్ స్కోర్ 700 కన్నా తక్కువ ఉన్నట్లయితే, మీకు రుణం పొందే అవకాశం తగ్గుతుంది. 700 నుంచి 800 మధ్యలో ఉన్నట్లయితే రుణం లభిస్తుంది. కానీ ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. చాలా బ్యాంకులు సిబిల్ స్కోర్ ను బట్టి వడ్డీ రేట్లు నిర్ణయిస్తున్నాయి. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో మీ సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నట్లయితే, తక్కువ వడ్డీ రేట్లకే రుణం లభించే అవకాశం ఉంది.


ఈ పొరపాటు చేస్తే మీ సిబిల్ స్కోర్ 500కు పడిపోయే అవకాశం:


అయితే ఒక్కోసారి మనం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఫలితంగా మీకు లోన్ లభించడం అనేది కష్టతరం అవుతుంది. అలాంటి ఒక సందర్భం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం తెలియకుండానే పొరపాట్లు చేస్తూ ఉంటాం. అలాంటిదే బ్యాంకు గ్యారంటీ సంతకం ఎవరైనా లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకులో షూరిటీ కోసం ఇతర వ్యక్తుల నుంచి షూరిటీ కోసం సంతకాలను సేకరిస్తూ ఉంటాయి తద్వారా మీరు ఎవరికైతే షూరిటీ ఇచ్చారో వారు రుణం చెల్లించినప్పుడు మీరు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. అయితే ఒక్కోసారి మీరు ఎవరికైతే షూరిటీ ఇచ్చారో వారు రుణాన్ని చెల్లించకపోతే ఆ ప్రభావం మీ సిబిల్ స్కోర్ పై పడే అవకాశం ఉంటుంది తద్వారా మీరు ఎలాంటి రుణం పొందకపోయినప్పటికీ మీ సిబిల్ స్కోర్ మాత్రం పడిపోతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకునే మీరు బ్యాంకు షూరిటీపై సంతకం చేయాల్సి ఉంటుంది.


Also Read : PSU Stock : ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టాక్ లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు రూ.2 లక్షలు లభించేవి  


బ్యాంకు ఉన్నతాధికారులు సైతం బ్యాంకు షూరిటీలు ఇచ్చే సమయంలో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బ్యాంకు రుణానికి షూరిటీ అంటే ఎవరైతే లోన్ చెల్లింపు దారుడు రుణాన్ని పొంది ఉన్నాడో అతడు తీర్చలేనప్పుడు ఆ రుణాన్ని మీరు చెల్లించాల్సి ఉంటుంది అందుకే బ్యాంకు షూరిటీ ఇచ్చేటి సమయంలో మీరు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని షూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. 


అందుకే మీరు షూరిటీగా ఎప్పుడైనా సంతకం చేసినప్పుడు, ఎవరైతే లోన్ తీసుకున్నారు వారు సకాలంలో వాయిదాలను చెల్లిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ప్రతినెలా గమనించాల్సి ఉంటుంది. లేకపోతే మీ సిబిల్ స్కోర్ దెబ్బ తినే ప్రమాదం ఉంది.


Also Read : Banks: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా? అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేదా?అయితే పెనాల్టీ ఛార్జీలు ఇవే..!!  


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook