Starbucks New CEO: ప్రతిరోజూ ఇంటి నుంచి పనికి 1600 కీమీ ప్రయాణిస్తున్న స్టార్‌బక్స్ కొత్త సీఈఓ.. ఇంతకీ ఆయన జీతం ఎంత తెలుసా?
Starbucks CEO Salary: బ్రియన్ నిక్కోల్ స్టార్ బక్స్ సీఈఓగా కొత్తగా నియమించారు. ఈయన ఉండేది క్యాలీఫొర్నియా అక్కడి నుంచి పనికి 1600 కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నారు. స్టార్‌బక్స్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్‌లో ఉన్న సియాటెల్‌కు కంపెనీ జెట్ విమానంలో ఇంత దూరం ప్రయాణిస్తున్నారు.
Starbucks CEO Salary: సాధారణంగా మనం ఇంటి నుంచి ఆఫీసులకు బస్సు, బైక్ మరి కాస్త జీతం ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ అయితే, కారులో ప్రయాణిస్తారు. ఎందుకంటే ఈ ఆఫీసులు మనం ఉండే దగ్గరి లొకేషన్లలో ఉంటాయి. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు రైలు ప్రయాణం చేస్తూ కూడా మరింత దూరం నుంచి వస్తారు. ఎంత సుదీర్ఘ ప్రయాణం అయినా ఒక్కరోజులో వెళ్లి వచ్చే దూరం ఉంటుంది.
అయితే, ఇందులో కొత్తదనం ఏముంది అనుకుంటున్నారా? స్టార్‌బక్స్ కొత్త అధినేత కొత్త తరహా ప్రయాణం చూస్తే మీరు కనుబొమ్మలు కచ్చితంగా పైకి లేపుతారు. ఎందుకంటే ఈయన ప్రతిరోజూ ఇంటి నుంచి ఆఫీసుకు 1600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. అవును ఇది నిజం.బ్రియన్ నిక్కోల్ స్టార్ బక్స్ సీఈఓగా కొత్తగా నియమించారు. ఈయన ఉండేది క్యాలీఫొర్నియా అక్కడి నుంచి పనికి 1600 కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నారు. స్టార్‌బక్స్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్‌లో ఉన్న సియాటెల్‌కు కంపెనీ జెట్ విమానంలో ఇంత దూరం ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే ఈయన రిలొకేట్ కాకుండా ఇంటి నుంచే ఆఫీసుకు వెళ్తున్నారట.
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
ఈ విషయం యూఎస్ సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) నిక్కోల్ కంపెనీ ఆఫర్ లెట్టర్‌లో వివరంగా ఉంది. ఎస్‌ఈసీ ప్రకారం స్టార్‌బక్స్ సీఈఓ జీతం ఏడాదికి 1.6 USD అంటే రూ. 13.42 కోట్లు. దీంతోపాటు ఈయనకు ఇతర సౌకర్యాలు కూడా స్టార్‌బక్స్ కల్పిస్తోంది. బోనస 3.6 మిలియన్ USD- 7.2 మిలియన్ USD అంటే రూ. 30- 60 కోట్లు.
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
ఇది కాకుండా కంపెనీ ఈ కొత్త సీఈఓకు ఈక్విటీ అవార్డు రూ. 193 కోట్ల వరకు అందిస్తుంది. కేవలం ఇవి మాత్రమే కాదు. ఈ సీఈఓ క్యాలీఫోర్నియాలోని తన ఇల్లును మారకుండా ఇంటి నుంచి ప్రయాణం చేస్తున్నార. దీనికి కంపెనీనే ప్రయాణ ఖర్చును భరిస్తోంది. ప్రత్యేక జెట్ విమానం క్యాలీఫొర్నియా నుంచి సియాటెల్‌కు మూడు రోజులు ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన హైబ్రీడ్ విధానంలో ఆఫీసుకు వెళ్తున్నారు. స్టార్‌బక్స్ త్వరలోనే క్యాలీపోర్నియాలో న్యూపోర్ట్ బీచ్ వద్ద చిన్న రిమోట్ ఆఫీసును కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఒప్పుకుందట. సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించి రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి