Penalty for Credit Card Users: ఐసీఐసీఐ బ్యాంక్ ఇవాల్టి నుంచి అంటే ఫిబ్రవరి 10 నుంచి క్రెడిట్ కార్డ్‌ల ఛార్జీలను సవరించింది. అన్ని క్రెడిట్‌ కార్డ్‌లపై ఇక నుంచి 2.5 శాతం ట్రాన్సాక్షన్ ఫీజ్‌ వసూలు చేయనుంది ఐసీఐసీఐ బ్యాంక్. అడ్వాన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్‌కు ఇది వర్తించనుంది. ఇందులో భాగంగా కనీసం 500 రూపాయలను వసూలు చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రెడిట్ కార్డ్‌ లేట్ పేమెంట్ ఛార్జీలను కూడా ఐసీఐసీఐ బ్యాంక్ పెంచింది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు సంబంధించిన క్రెడిట్‌ కార్డ్ ఎమరాల్డ్ తప్ప మిగతా అన్ని కార్డులకు ఇది వర్తిస్తుంది. 


అంతేకాదండోయ్... మినిమమ్ బ్యాలెన్స్ పేమెంట్ ప్రాతిపదికన ఈ లేట్ పేమెంట్ ఛార్జీలు మారుతాయి. ఒకవేళ క్రెడిట్ కార్డ్ బిల్ 100 రూపాయల్లోపు ఎలాంటి ఛార్జీలు పడవు. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం గరిష్టంగా 1200 రూపాయల వరకు అదనపు ఛార్జీలు పడతాయి. క్రెడిట్ కార్డ్‌పై అవుట్‌ స్టాండింగ్ అమౌంట్ 50వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఈ ఛార్జీలు వర్తిస్తాయి.


రూ. 100 - రూ.500 మధ్య బకాయి ఉంటే రూ. 100 ఛార్జ్ చేస్తారు. రూ. 501 - రూ. 5000 బకాయి ఉంటే రూ. 500 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. రూ.10,000 వరకు ఉంటే రూ. 750. అలాగే రూ. 25000 వరకు అయితే రూ. 900. రూ. 50,000 వరకు అయితే రూ 1000 అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది ఐసీఐసీఐ బ్యాంక్. రూ. 50,000 పైన ఉంటే మాత్రం.. రూ.1200 ఛార్జీ వసూలు చేయనుంది.


ఇక ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ బ్యాంకులు క్రెడిట్‌ కార్డులపై 50,000 రూపాయల కంటే ఎక్కువ బకాయి ఉంటే 1300 రూపాయల అదనపు ఛార్జీలు విధిస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ 1000 రూపాయలు వసూలు చేస్తోంది. ఇప్పుడు ఆ బ్యాంకులకు సమానంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా క్రెడిట్ కార్డులపై అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. అంతేకాదు చెక్ రిటర్న్‌ విషయంలో చెల్లించాల్సిన మొత్తంలో 2 శాతం అదనపు ఛార్జిని ఐసీఐసీఐ బ్యాంక్‌ విధిస్తోంది. ఇందులో భాగంగా కనీసం 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


Also Read: Monkey Fever in Kerala: కరోనా తగ్గుముఖం పట్టేలోపు దేశంలో మరో వైరల్ ఫీవర్ కలవరం!


Also Read: Avika Gor Photos: చీరలో 'చిన్నారి పెళ్లికూతురు' అదిరిపోయిందిగా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook