Credit Card New Rules 2023: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? అయితే కొత్త నిబంధనలు తెలుసుకోండి. ఈ రెండు బ్యాంకులు జనవరి నుంచి క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన నియమాలను మార్చాయి. వినియోగదారులకు గతంలో కంటే ఎక్కువ ప్రయోజనాలు, సౌకర్యాలను అందించడం లక్ష్యంగా రూల్స్‌ను మార్చాయి. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడంపై అందుబాటులో ఉన్న రివార్డ్ పాయింట్ విధానంలో మార్పు చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించే రుసుము నిబంధనలో కూడా మార్పు చేశారు. రెండు బ్యాంకులు జనవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను అమలు చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ ఫీజులు, రివార్డ్ పాయింట్ ప్రోగ్రామ్‌లో మార్పులు జరిగాయి. థర్డ్ పార్టీ యాప్ ద్వారా అద్దె చెల్లింపుపై మొత్తంలో ఒక శాతం చెల్లించాలి. అద్దె చెల్లింపు కోసం అన్ని కార్డులపై రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉండవు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉండవు.


మీరు మరే ఇతర దేశానికి వెళ్లి భారతదేశంలో ఉన్న ఏ వ్యాపారి నుంచి అయినా మన కరెన్సీలో లావాదేవీలు చేస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌తో రివార్డ్ పాయింట్ సిస్టమ్‌లో మారుస్తుంది. కానీ అతను విదేశాలలో నమోదు చేసుకున్నట్లయితే.. అప్పుడు ఒక శాతం డైనమిక్, స్టాటిక్ కన్వర్షన్ మార్కప్ తీసుకుంటారు. హోటల్, టిక్కెట్ బుకింగ్‌పై హెచ్‌డీఎఫ్‌సీ రివార్డ్ పాయింట్ సిస్టమ్‌ను మార్చింది.


క్రెడిట్ కార్డ్‌లపై అందుబాటులో ఉన్న రివార్డ్ పాయింట్ సిస్టమ్‌ను ఎస్‌బీఐ కూడా మార్చింది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ షాపింగ్‌పై అందుకున్న రివార్డ్ పాయింట్‌లో నిబంధనలు మారాయి. బుక్ మై షో, క్లియర్ ట్రిప్, Apollo 24X7, EazyDiner, Lenskart, Netmedsలో ఆన్‌లైన్ చెల్లింపులపై ఎస్‌బీఐ 10X రివార్డ్ పాయింట్లను అందించడం కొనసాగిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు ఛార్జీని ఎస్‌బీఐ ఇప్పటికే 15 నవంబర్ 2022 నుంచి సవరించింది. ఇది కాకుండా అన్ని బిజినెస్ ఈఎంఐలపై ప్రాసెసింగ్ ఫీజు రూ.199 తగ్గించింది. 


Also Read: Lockdown in India: దేశంలో మళ్లీ లాక్‌డౌన్.. 15 రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఇదిగో క్లారిటీ  


Also Read: Shock to Balakrishna: నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలకి ఏపీ సర్కార్ షాక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook