Andhra Pradesh Government Shock to Balakrishna and Chiranjeevi: నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లుగా అయింది. అసలు విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి అనే సినిమా రూపొందింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా వీరసింహారెడ్డి రూపొందింది.
ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఊక ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో నిర్వహించాలని సినిమా యూనిట్ ఘనంగా ప్లాన్ చేసుకుంది. ఈ నెల ఆరవ తేదీన అంటే శుక్రవారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోల్లో నిర్వహించాలని భావించి పోలీసులకు సినిమా యూనిట్ ఇప్పటికే అనుమతి కోరుతూ లేఖ రాసింది.
అయితే ఈ లేఖకు స్పందిస్తూనే పోలీసులు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు ఏబియం గ్రౌండ్స్ లో ఈనెల 6వ తేదీన నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని భావిస్తూ పోలీసులకు లేఖ రాయగా పక్క జిల్లాల నుంచి బాలకృష్ణ అభిమానులు ఎక్కువగా రావచ్చు అని, వారి తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించిన పోలీసులు అక్కడ నుంచి వేదిక మార్చుకోవాలని సూచించారు.
అంతేకాకుండా ఒంగోలు నగరంలో ఈవెంట్ నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని కూడా పోలీసులు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ సభలకు, భారీ ర్యాలీలు, సభలకు సంబంధించి కొన్ని ఆంక్షలు కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈవెంట్ కు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఒకరకంగా ప్రత్యామ్నాయ వేదిక కోసం వీరసింహారెడ్డి మూవీ యూనిట్ ప్రస్తుతానికైతే శోధిస్తోంది. ఒంగోలు నగరం బయట ఎక్కడైనా ఈవెన్ నిర్వహించుకోవాలని యూనిట్ నిర్వహకులకు పోలీసులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క వైజాగ్ లో ఈ నెల 8వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు పోలీసులు అనుమతి కోరితే వారికి కూడా చుక్కెదురైనట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులు నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించినట్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలతో సినిమా యూనిట్ ఏమైనా చర్చలు జరిపి తమ సినిమా ఈవెంట్లకు అనుమతి కోరినా ప్రభుత్వం నిరాకరించే అవకాశం కనిపిస్తోంది. అనుమతి ఇస్తే రాజకీయ విమర్శలు ఎదురవుతాయి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగానే వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: Perni Nani on BRS: ఏపీకి ద్రోహం చేసిన తెలంగాణ నేతలేవచ్చి ఏమి ఉద్ధరిస్తారు?
Also Read: Woman Slits Husband's Throat: ఏపీలో న్యూయర్ విషెష్ చెప్పలేదని భర్త గొంతు కోసిన భార్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook