Good newsకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... త్వరలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. డియర్‌నెస్ అలవెన్స్ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు పొందుతున్న 34 శాతంగా డీఏను మరో 4 శాతం పెంచాలని భావిస్తోంది. ఈ పెంపు జరిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 38 శాతం డీఏ పొందనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా కేంద్రం సమాచారం ఇస్తోంది. అయితే ఈ పెంపు ఉద్యోగులకు అందేందుకు మరో మూడు నెలల వరకు ఆగాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ చెబుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెన్షనర్లు కూడా ఈ పెంపు ద్వారా లబ్ది పొందనున్నారని సమాచారం. 7వ వేతన సంఘం ప్రకారం.... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏతో పాటు డీఆర్ కూడా పెంచాల్సి ఉంది.  ఇప్పుడు డియర్‌నెస్ రిలీఫ్ 34 శాతం ఉంది. ఇకపోతే కొత్త డీఏ, డీఆర్ రేట్లను కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలలో ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు డీఏతో పాటు డీఆర్ కూడా మరో నాలుగు శాతం పెరిగే అవకాశం ఉంది. అంటే తాజా పెంపుతో  డియర్‌నెస్ అలవెన్స్ కూడా 38 శాతానికి పెరగనుంది. ఫార్మాలిటీస్ అన్నీ సకాలంలో పూర్తి అయితే అగస్టు నెల జీతంలో ఈ రెండు పెంపులు జమ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ, నాలుగు శాతం డీఆర్ కలిసి అగస్టు నెల జీతంలో పడే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదన ఇప్పుడు సూత్రప్రాయంగా ఉందని అన్నీ ఫార్మాలిటీస్ పూర్తి అయితేనే అగస్టు నెల జీతంలో ఇవన్నీ కలిసి వచ్చే  అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. లేదంటే మరి కొంత కాలం ఎదురు చూడాల్సి ఉంటుందని చెబుతోంది.


ఉద్యోగులు కేంద్రం ప్రకటిస్తున్న బంపర్ ఆఫర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఖర్చులు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం ఇచ్చే ఈ పెంపుతో ఖర్చులు కలిసి వస్తాయని అంటున్నారు. ఖర్చుల పెరుగదల కారణంగా సేవింగ్స్ తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు జీతాల పెంపును ద్రవ్యోల్భణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతే ఉద్యోగులు గౌరవప్రదమైన జీవితాన్ని గుడుపుతారని చెబుతున్నారు. ఉద్యోగులు సంతృప్తిగా బతకగలిగినప్పుడే ఆఫీసులో మెరుగైన సేవలు అందిస్తారని సర్వేలు చెపుతున్నాయని గుర్తు చేస్తున్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ తో పాటు పలు కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగుల జీతాలను ఇటీవలే ఏకంగా రెండింతలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్పోరేట్ సంస్థల మాదిరిగా జీతాల పెంపును సకాలంలో చేపడితే సత్పలితాలు వస్తాయని విన్నవించుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్దల ఉకదంపుడు ప్రసంగాలతో పాలనలో ఎలాంటి మార్పు రావని చెబుతున్నారు. ఉద్యోగులు మనస్పూర్తిగా పని చేస్తేనే పాలన సజూవుగా సాగుతుందని చెపుతున్నారు. ఇందుకోసం జీతాల పెంపును ప్రభుత్వాలు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 


also read Hyundai Santro Discontinued: హ్యుందాయ్ షాకింగ్ డెసిషన్. ఇక ఆ కారు ఉత్పత్తి బంద్..!


also read I Kall Mobile Amazon: 249 రూపాయాలకే 4G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేయోచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.