DA Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 7వ వేతన సంఘం సిఫార్సులను అనుసరించి ఉద్యోగులకు మరో 3 శాతం డీఏ (డియర్​నెస్ అలవెన్స్​)  పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది జనవరి నుంచే పెంచిన డీఏ వర్తించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరిగిన డిఏ అమలులోకి వస్తే.. బేసిస్​ శాలరీలో డీఏ 34 శాతానికి చేరనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్​ (డియర్​నెస్ రిలీఫ్​)ను.. ఆల్​ ఇండియా కన్సూమర్​ ప్రైజ్ ఇండెక్స్​ ఫర్​ ఇండస్ట్రీయల్ వర్కర్స్​ ప్రకారం లెక్కిస్తారు. దీనిని లేబర్​ బ్యూరో ఆఫ్​ లేబర్​ అండ్ ఎంప్లాయ్​మెంట్​ విడుదల చేస్తుంది. అంటే ఉద్యోగులకు ద్రవ్యోల్బణం పెరగటం వల్ల కలిగే ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో డీఏను పెంచుతూ ఉంటుంది ప్రభుత్వం.


దేశంలో 2021 అక్టోబర్​-డిసెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 5.01 శాతంగా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 6.07 శాతానికి పెరిగింది. దీనితో పెరిగిన ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా డీఏను పెంచుతూ నిర్ణయం తీసకుంది ప్రభుత్వం.


ఇంతకు ముందు 2021 జులై 1న డీఏను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన డీఏ, డీఆర్​ను విడుదల చేసింది ప్రభుత్వం.
ఇత తాజాగా పెంచిన డీఏ, డీఆర్​తో ప్రభుత్వంపై ఏటా రూ.9,544 కోట్ల అదనపు భారం పడనుందని తెలిసింది.


Also read: Petrol price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు- హైదరాబాద్​లో సెంచరీ కొట్టిన డీజిల్​..


Also read: Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, తగ్గుతున్న బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook