డెబిట్, క్రెడిట్ కార్డులపై ఉండే సివివి అర్థం ఏంటి ? సివివితో హ్యాకర్స్ మోసం చేయలేరా ?
మీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేసే క్రమంలో కార్డు వెనకాలే ఉన్న సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సి రావడం చూసే ఉంటారు. ఇంతకీ ఈ సీవీవీ నెంబర్ అంటే ఏంటి ? డిజిటల్ పేమెంట్స్‌లో సివివి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
డీమానిటైజేషన్ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి ప్రాధాన్యత పెరిగింది. ఆ తర్వాత కరోనా వైరస్ ప్యాండెమిక్ కారణంగా డిజిటల్ పేమెంట్స్ సర్వసాధారణం అయ్యాయి. అయితే, మీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేసే క్రమంలో కార్డు వెనకాలే ఉన్న సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సి రావడం చూసే ఉంటారు. ఇంతకీ ఈ సీవీవీ నెంబర్ అంటే ఏంటి ? డిజిటల్ పేమెంట్స్‌లో సివివి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అసలు సీవీవీ అంటే ఏంటి ?
సివివి అంటే కార్డ్ వెరిఫికేషన్ వ్యాల్యూ. విసా కార్డ్, మాస్టర్ కార్డు.. కార్డు ఏదైనా దాని వెనకాల భాగంలో 3 అంకెల్లో కనిపించి నెంబరే ఈ సివివి నెంబర్. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ లాంటి కొన్ని కార్డులపై మాత్రం ఈ సివివి నాలుగు అంకెల్లో ఉంటుంది. కార్డు వెనకాల ఖాళీగా కనిపించే స్థలం చివర్లో ఈ సివివి నెంబర్ నమోదై ఉంటుంది.
సివివి కార్డ్ అనేది యూనిక్ నెంబర్. కార్డు నెంబర్ ఆధారంగా కానీ లేదా పిన్, ఎక్స్‌పైరేషన్ ఆధారంగా కానీ ఈ సివివి నెంబర్‌ని నిర్ణయించరు. అందువల్లే హ్యాకింగ్‌కి పాల్పడే వాళ్లకు సివివి నెంబర్‌ని కనుక్కోవడం కష్టం మాత్రమే కాదు.. అసాధ్యం కూడా.
Also read : బంగారం కొంటున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
సివివి ఉపయోగం ఏంటి ?
ఫ్రాడ్ జరగకుండా నివారించడానికి సివివి బాగా ఉపయోగపడుతుంది. డిజిటల్ పేమెంట్స్ చేసే క్రమంలో మోసగాళ్లకు కస్టమర్ల డెబిట్ కార్డు నెంబర్ లేదా క్రెడిట్ కార్డు నెంబర్ చిక్కే అవకాశం ఉంటుందేమో కానీ సివివి నెంబర్ చిక్కే అవకాశం మాత్రం అస్సలు ఉండదంటున్నాయి బ్యాంకులు. అందుకే రెండింతల భద్రత కోసం సివివి నెంబర్ ఉపయోగపడుతుంది.
Also read : డౌన్‌లోడ్ స్పీడ్‌లో జియో అగ్రస్థానం- అప్‌లోడ్‌లో వొడాఫోన్ ఐడియా జోరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook