United Forum of Bank Unions has called a two-day strike: ఈ నెలలో రెండు రోజులు బ్యాంక్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు సమ్మెకు సిద్ధమవుతుండటమే ఇందుకు కారణం. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా.. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగ సంఘాలు రెండు రోజుల సమ్మె చేపట్టాలని (Bank Unions Strike) నిర్ణయించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యునైటెడ్​ ఫోరమ్​ ఆఫ్​ బ్యాంక్ యూనియన్​ (యూఎఫ్​బీయూ) ఈ మేరకు సమ్మెకు (UFBU calld for Banks Strike) పిలుపునిచ్చింది. డిసెంబర్ 16 నుంచి రెండు రోజులు సమ్మె చేయాలని నిర్ణయించింది. 


రెండు రోజుల సమ్మేతో పాటు.. ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి (Banks privatisation) ఉపసంహరించుకోకుంటే.. పలు నిరసన కార్యక్రకమాలు కూడా చేపట్టనున్నట్లు ఆల్​ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫిడరేషన్​ (ఏఐబీఓసీ) ప్రధాన కార్యదర్శి సంజయ్ దాస్​ వెల్లడించారు. 


2021-22 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు (Fin Min Nirmala Sitharaman on Banks privatisation) ప్రకటించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించింది ప్రభుత్వం. ప్రైవేటీకరణ నిర్ణయం త్వరలో అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంక్​ యూనియన్లు సమ్మేకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


ఆర్థిక వ్యవస్థకు నష్టం..


ప్రభుత్వం రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల..  ఆర్థిక వ్యవస్థలో ప్రధాన రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని సంజయ్ దాస్ పేర్కొన్నారు. ముఖ్యంగా స్వయం సహాకార సంఘాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు రుణ అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఉద్దేశించినది కాదని.. పూర్తిగా రాజకీయ పరమైన నిర్ణయమేనని ఆయన చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం దేశంలో డిపాజిట్లలో 70 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయన్నారు. వాటిని ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించడం ద్వారా.. సామాన్యుల డబ్బు ప్రమాదంలో పడుతుందని వివరించారు.


Also read: flipkart Big Bachat Dhamaal Sale.. ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై అమేజింగ్ ఆఫర్స్!


Also read: Stock Market today: ఒమిక్రాన్ భయాలున్నా స్టాక్ మార్కెట్ల జోరు- సెన్సెక్స్ 776 పాయింట్లు జంప్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook