Digital Gold: ఆన్‌లైన్ డిజిటల్ గోల్డ్ విక్రయాలు ఎలా చేయాలి, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎలా పొందాలి
Digital Gold: ప్రస్తుతం అన్ని క్రయవిక్రయాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఆఖరికి బంగారం కూడా ఆన్‌లైన్ విక్రయం అధికమైంది. ఈ నేపధ్యంలో ఆన్‌లైన్ బంగారం విక్రయం ఎలా చేయాలి, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎలా పొందాలో తెలుసుకుందాం..
Digital Gold: ప్రస్తుతం అన్ని క్రయవిక్రయాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఆఖరికి బంగారం కూడా ఆన్‌లైన్ విక్రయం అధికమైంది. ఈ నేపధ్యంలో ఆన్‌లైన్ బంగారం విక్రయం ఎలా చేయాలి, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎలా పొందాలో తెలుసుకుందాం..
పెట్టుబడులు పెట్టేందుకు చాలా మార్గాలుంటాయి. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించేవారికి మేం అందించే వివరాలు ప్రయోజనంగా ఉంటాయి. ఇంట్లో కూర్చునే సులభంగా బంగారం కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు..బంపర్ క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్ డౌన్‌లోడ్ చేస్తే చాలు. ఈ యాప్ ఆధారంగా సులభంగా, చౌకగా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఆ యాప్ ఏంటి, ఎలా చేయాలో చూద్దాం..
మీరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే..ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ కంటే సులభంగా కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఇతర లాభాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. దీనికోసం మీరు పేటీఎం యాప్ కలిగి ఉంటే చాలు. దీంతో మంచి చౌక ధరలకు డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. ఈ యాప్ పై గోల్డ్ బ్యాంక్ ఆఫర్ కూడా నడుస్తోంది. యాప్ ద్వారా తొలిసారి బంగారం కొనుగోలు చేస్తే 3 శాతం అంటే అత్యధికంగా 100 రూపాయలవరకూ గోల్డ్‌బ్యాక్ లభిస్తుంది.
గోల్డ్ ఎలా కొనుగోలు చేయాలి
చౌకగా, సులభంగా బంగారం కొనుగోలు చేసేందుకు ముందుగా పేటీఎం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తరువాత హోమ్ పేజిలో గోల్డ్ అని సెర్చ్ చేయాలి. పేటీఎం గోల్డ్ పేజ్ ఓపెన్ చేసి..బంగారం ధరల్ని పరిశీలించండి. బంగారం బరువు, ధర రెండూ చెక్ చేసుకోవచ్చు. మీకు కావల్సింది ఎంచుకుని...ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తే..గ్రాము లెక్కన ధర కన్పిస్తుంది. ఇందులో 3 శాతం జీఎస్టీ కలిపి ఉంటుంది. డిజిటల్ గోల్డ్ అనేది 99.9 శాతం శుద్ధమైంది, 24 క్యారెట్ గోల్డ్ అని పేటీఎం చెబుతోంది.
పేమెంట్ ఎలా
డిజిటల్ గోల్డ్ పేమెంట్ ఎలా చేయాలో ఇప్పుడు పరిశీలిద్దాం. చెల్లింపు చేసేముందు క్యాష్‌బ్యాక్ కోసం ఏదైనా ప్రోమో కోడ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే ఆ కోడ్ అప్లై చేసుకుని పేమెంట్ పూర్తి చేయాలి. అంతే మీ పేటీఎం లాకర్‌లో డిజిటల్ గోల్డ్ జమ అయిపోతుంది.
పేటీఎం గోల్డ్ ఫీచర్లు ఇలా
ఈ యాప్‌లో 1 రూపాయి నుంచి మొదలుకుని 1.5 లక్షల వరకూ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. గ్రాముల ప్రకారం పరిశీలిస్తే 0.0005 గ్రాముల్నించి 50 గ్రాముల వరకు కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా మీరు కొనుగోలు చేసే డిజిటల్ గోల్డ్ అమ్మాలంటే..0.0005 గ్రాముల నుంచి కూడా అమ్ముకోవచ్చు.పేటీఎంలో లైవ్ ప్రైస్ అనేది 6 నిమిషాలవరకూ వ్యాలిడిటీ ఉంటుంది. ఈలోగా లావాదేవీలు పూర్తి చేయాలి. మీ బ్యాంకు ఎక్కౌంచ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ అవసరమౌతుంది. మీ ఎక్కౌంట్‌లో 72 గంటల్లోగా డబ్బులు క్రెడిట్ అవుతాయి.
Also read: Cooking Oil Prices: వంట నూనెల ధరలు మళ్లీ తగ్గనున్నాయా... అదే జరిగితే సామాన్యులకు బిగ్ రిలీఫ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook