Gold Investment:  బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది. త్వరలోనే బంగారం ధర ఒక లక్ష రూపాయలు తాగిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలపై మీరు లాభాలను ఒడిసి పట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే బంగారంలో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం లో పెట్టుబడి అనగానే ముందుగా గుర్తొచ్చేవి బంగారు ఆభరణాలు గోల్డ్ బిస్కెట్లు గోల్డ్ కాయిన్లు మాత్రమే. వీటిని ఫిజికల్ గోల్డ్ పై పెట్టుబడి అంటారు. అయితే ఫిజికల్ గోల్డ్ బై పెట్టుబడి లాభదాయకమా? లేక డిజిటల్ రూపంలో గోల్డ్ పై పెట్టుబడి పెట్టడం లాభదాయకమా? అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


డిజిటల్ బంగారం: 


-మీరు డిజిటల్ బంగారంలో రూ. 100 కంటే తక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి కనీస పరిమితి లేదు. అంటే ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.


-డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి పలు రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 


-డిజిటల్ గోల్డ్ విక్రయించడం లేదా మరెక్కడైనా పెట్టుబడి పెట్టడం సులభం. ఒకరు సులభంగా యూనిట్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు. అలాగే వీటిని సులభంగా విక్రయించవచ్చు.


- డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లను రుణాలకు తాకట్టుగా ఉపయోగించవచ్చు.


- డిజిటల్ గోల్డ్ వాలెట్ లో  సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు.


- ఇందులో చోరీకి గురయ్యే ప్రమాదం లేదు. 


- మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మీ పెట్టుబడులను సులభంగా ట్రాక్ చేయవచ్చు.


Also Read: PM Internship Scheme: టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌.. నెలకు రూ. 5000 కోటీమంది పొందే అవకాశం, ఈ లింక్‌తో వెంటనే అప్లై చేసుకోండి..  


-డిజిటల్ బంగారం కేవలం 2-3% GST ఛార్జీని ఉంది.


- బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు సావరిన్ గోల్డ్ బాండ్లు కూడా ఒక సురక్షితమైన సాధనంగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు బంగారంతో సమానంగా రాబడి పొందవచ్చు. బంగారం ధర పెరిగినప్పుడల్లా ఈ బాండ్ల ధర కూడా పెరుగుతుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. అలాగే ఇందులో పెట్టుబడిపై మీకు వడ్డీ కూడా లభిస్తుంది. పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 


భౌతిక బంగారం:


-ఫిజికల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆభరణాల వద్దకు వెళ్లి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి. 


- మీరు బంగారు ఆభరణాలలో పెట్టుబడి పెడితే, మీరు మేకింగ్ ఛార్జీలు చెల్లించాలి. ఇందులో 20% - 30% మేకింగ్ ఛార్జ్ ఉండవచ్చు.


-అయితే మీరు బంగారు ఆభరణాలతో లోన్ తీసుకోవచ్చు.


- ఫిజికల్ గోల్డ్ సురక్షితమైన పెట్టుబడి సాధనం కాదు. దీనికి లాకర్ అవసరం.


-అంతే కాకుండా ఫిజికల్ బంగారం చోరీకి గురయ్యే ప్రమాదం కూడా ఉంది.


Also Read: Pension Scheme: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!    


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook