Car Insurance For Cars Drowned in Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసినప్పటికీ.. తెలంగాణలో ఒకింత ఎక్కువ వరదల ప్రభావం కనిపించింది. మరీ ముఖ్యంగా భూపాలపల్లి, నిజామాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్, ములుగు, ఖమ్మం వంటి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలే కాదు.. నదులు సైతం ఉప్పొంగి ప్రవహించడంతో ప్రాజెక్టులు అన్నీ గేట్లు ఎత్తి నీటిని కిందకు దిగువకు విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగిన సంగతి కూడా తెలిసిందే. అలాగే హైదరాబాద్ మహా నగరంతో పాటు వరంగల్, ఖమ్మం లాంటి పట్టణాల్లోనూ అనేక లోతట్టు ప్రాంతాలు వరదల్లో నీట మునిగాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో వాహనదారులకు చాలామందికి ఎదురైన కామన్ ప్రాబ్లం ఏంటంటే.. తమ కార్లు, ఇతర వాహనాలు కూడా నీట మునిగాయి. ఇంకొంతమంది కార్లు ఏకంగా వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోజుల తరబడి వరద నీటిలోనే ఉండటంతో ఇంజన్స్ మొరాయిస్తున్నాయి. ఇంకొన్ని కేసుల్లో అసలు స్టార్ట్ అవడం లేదు. దీంతో వాహనదారులు అందరూ సర్వీస్ సెంటర్లు, మెకానిక్స్ వద్దకు పరుగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కార్ల యజమానులను వేధిస్తున్న ప్రశ్న ..
ఈ క్రమంలోనే చాలా మంది కార్ల యజమానులకు వస్తోన్న సందేహం ఏంటంటే... తమ కారుకు వరదల వల్ల జరిగిన డ్యామేజీకి ఇన్సూరెన్స్ కవర్ వర్తిస్తుందా లేదా అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. వరదల్లో మునిగి కార్లు అంతా డ్యామేజ్ అయిపోయిన నేపథ్యంలో ఇన్సూరెన్స్ కవర్ లభిస్తే పర్వాలేదు కానీ.. ఒకవేళ ఇన్సూరెన్స్ వర్తించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే భయం ఇప్పుడు వరదల్లో కార్లు నీట మునిగి నష్టపోయిన వారినే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉండే కార్ల యజమానుల్లో కనిపిస్తోంది. 


ఇండియాలో వరదల్లో దెబ్బ తిన్న కార్లకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా లేదా అంటే అది మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. అదెలా అంటే.. ఇండియాలో రెండు రకాల వెహికిల్ ఇన్సూరెన్స్ లు లభిస్తాయి. అందులో ఒకటి కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ అయితే.. రెండోది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారికి వరదలు, అగ్ని ప్రమాదం, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు వల్ల కలిగే నష్టాలతో పాటు అన్ని ఇతర డ్యామేజీలు కవర్ అవుతాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే సందర్భంలో ఎలాంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. 


ఇది కూడా చదవండి : Honda Elevate Car Review: హోండా ఎలివేట్ కారు రివ్యూ.. ధర, ఫీచర్స్. మైలేజ్ వివరాలు


ఒకవేళ మీరు తీసుకున్నది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినట్టయితే.. కాంప్రెహెన్సివ్ తరహాలో అన్నీ కవర్ కావు. కేవలం మీ వల్ల ఎదుటి వారి వాహనానికి, వారికి జరిగే నష్టం మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇది ఇండియాలో బేసిక్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ. చట్టరీత్యా వాహనాలకు కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలన్న నిబంధన దృష్ట్యా కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తో మాత్రమే సరిపెట్టుకోవడం కనిపిస్తుంది. కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్‌తో పోల్చుకుంటే... థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఎంతో చౌక బేరం. చాలామంది ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తో సరిపెట్టుకోవడానికి ఒకరకంగా అదే ప్రధాన కారణం అని కూడా అనుకోవచ్చు. ఇదండీ సంగతి. ఎప్పటికప్పుడు కొత్తగా మార్కెట్లో లాంచ్ అయ్యే కార్లు, కార్లకు సంబంధించిన ఫీచర్స్, ధరలు, ఏవి బెటర్, ఏవి బెటర్ కాదు అనే అంశాలతో పాటు ఇలా ఇన్సూరెన్స్‌కి సంబంధించిన మరెన్నో అంశాల కోసం కీప్ రీడింగ్ జీ తెలుగు న్యూస్.


ఇది కూడా చదవండి : Discontinued Cars & SUVs In 2023: 2023 నుంచి తయారీ ఆగిపోయిన కార్ల జాబితా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి