Wi Fi Tips: మీ వైఫైని ఎవరైనా అక్రమంగా వాడుతున్నారని అనుమానమా? అయితే ఇలా చేయండి..
Wi Fi Tips: ఇంటర్నెట్ వాడేందుకు ప్రస్తుతం వైఫైని ఎక్కువగా వినియోగిస్తున్నాం. వైఫైని సురక్షితంగా వినియోగించడం ఎలా? హ్యాకర్ల బారిన పడకుండా వైవైని కాపాడుకునే సెట్టింగ్స్ ఏమిటి?
Wi Fi Tips: ఇంటర్నెట్.. ప్రపంచ రూపు రేఖలు మార్చిన ఆవిష్కరణ. తొలినాళ్లలో అరుదుగా మాత్రమే ఇది వినియోగంలో ఉండేడి. ఇప్పుడు ప్రపంచం నలుమూలలా ఇంటర్నెంట్ వినియోగం అవుతోంది.
మొదట కేబుల్ కెనెక్షన్ ద్వారా మాత్రమే కంప్యూటర్లలో ఇంటర్నెట్ వాడుకునే వీలుంటేది. ఇప్పుడు చేతిలో స్మార్ట్ద్వారా కూడా ఇంటర్నెట్ను యాక్సెస్ చేయొచ్చు.
వైఫైతో మరింత విరివిగా ఇంటర్నెట్ వినియోగం..
ఇక ఇళ్లల్లో, ఆఫీస్‌లలో ఉండే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇతర గాడ్డెట్స్కు ఒకే సారి ఎలాంటి కేబుల్స్ అవసరం లేకుండానే ఇప్పుడు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. అదే వైఫై.
రూటర్‌కు నెట్ అందించే కేబుల్‌ను కనెక్ట్ చేసి.. దానిని ఒక చోట ఉంచడం ద్వారా అది అందించే సిగ్నల్స్ (వైఫై)తో సులభంగా ఇంటర్నెట్ వాడుకునే వీలుంది.
వైఫై వినియోగం అనేది ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. ఇదే సమయంలో వైఫైని అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య కూడా పెరిగి పోతోంది.
వైఫైకి పాస్వర్డ్స్ పెట్టుకున్నప్పటికీ.. కొంత మంది హ్యాకర్లు వైఫైని అక్రమంగా వాడుతుంటారు.
మరి మీ వైఫైని ఎవరైనా అక్రమంగా వాడుతున్నారా? వైఫైని సురక్షితంగా ఎలా భద్రపరుచుకోవాలి? అనే వివరాలు మీకోసం.
ఉన్నట్టుండి కొన్ని రోజులుగా మీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గినట్లు గమనిస్తే.. మీ వైఫైని ఎవరైనా అక్రమంగా వాడుతున్నారని అనుమానించొచ్చు.
కొన్ని సార్లు సర్వర్ సమస్య, నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం, రూటర్‌లో ఏదైనా సమస్య ఉన్నా కూడా నెట్ స్పీడ్ తగ్గే అవకాశముంది. అయితే ఎలాంటి సమస్య లేకుండానే నెట్ స్పీడ్ తగ్గుతోందంటే.. అనుమానించాల్సిందే.
అలాంటి అనుమానం వచ్చినప్పుడు రూటర్‌ను రీబూట్ చేసి పాస్వర్డ్ మార్చడం ఉత్తమం.
ఎన్ని డివైజ్‌లు కనెక్ట్ అయ్యాయో తెలుసుంటే మేలు..
అయితే ఎవరైనా మీ వైఫైని అక్రమంగా వాడుతున్నారా? అని తెలుసుకునేందుకు ఓ సులభమైన మార్గం ఉంది. రూటర్ సెట్టింగ్స్‌లోకి లాగ్ఇన్ అయ్యి.. ఎన్ని డివైజ్‌లు కనెక్ట్ అయ్యాయి? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
వైఫైకి కనెక్ట్ అయిన ఒక్కో డివైజ్‌కు ఒక్క ఐపీ అడ్రస్ లేదా మ్యాక్ అడ్రస్ ఉంటుంది. మీకు సంబంధించిన డివైజ్‌ల ఐపీ అండ్రస్తో వాటిని సరిపోల్చుకుని.. మిగతవాటిని బ్లాక్ చేసే వీలుంది. ఐపీ అడ్రస్ బ్లాక్ చేసిన డివైజ్‌లు మీ వైఫై ద్వారా ఇంటర్నెట్ వాడుకునే వీలు ఉండదు.
పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలంటే..
వైఫైకి పాస్వర్డ్ పెట్టుకునేందుకు ప్రస్తుతం WPA2 ఎన్క్రిప్టెడ్ ప్రోటోకాల్ అందుబాటులో ఉంది. WPA2 అంటే.. వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్. ఇంతకు ముందు ఉన్న ప్రొటోకాల్స్ WPA, WEPలకు ఇది అడ్వాన్స్డ్ వెర్షన్.
మీ రూటర్‌లో WPA2 అప్షన్‌ను ఎంచుకుని.. కఠినమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి. మీకు మాత్రమే తెలిసే విధంగా నంబర్స్, ఆల్ఫాబెట్స్, సింబల్స్ ఉండేలా ఈ పాస్వర్డ్ ఉండాలి.
రూటర్ లాగిన్ ఐడీ మార్చుకోవడం..
వైఫై రూటర్లలో ఎక్కువగా 192.168.1.1 లేదా 192.168.2.1 ఐపీ అడ్రెస్‌లను కలిగి ఉంటాయి. మరో విషయం ఏమిటంటే.. చాలా రూటర్లు.. 'root' లేదా 'admin' లాగిన్ అడ్రస్‌లుగా ఉంటాయి.
కాబట్టి ఐపీ అడ్రెస్, లాగిన్ ఐడీలను చాలా మంది సులభంగా కనుగొనే వీలుంది. ఒకసారి ఎవరైన రూటర్‌లోకి లాగిన్ అయ్యారంటే.. అందులో పాస్వర్డ్ తెలుసుకోవడం, దానిని మార్చడం సులభమైన పని. అందుకే రూటర్ ఐడీని మార్చుకోవాలి. ఈ ఐడీని ఎవరికీ చెప్పకూడదు.
చివరగా.. ఈ జాగ్రత్తలన్నింటితో పాటు.. మీరు ఎప్పటికప్పుడు సులభంగా మీ వైఫైని ట్రాక్ చేసేందుకు AirSnare వంటి సాఫ్ట్వేర్లను ఉపయోగించాలి. ఇవి మీ వైఫైని ఎవరైనా అక్రమంగ వాడుతుంటే మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి.
Also read: Flipkart Big Bachat Dhamaal Sale: రూ.75,000 విలువైన స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే పొందండి!
Also read: Cheap and Best Phone: నెలకు రూ. 500 లోపు ఈఎంఐతో సూపర్ స్మార్ట్ ఫోన్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook