Flipkart Big Bachat Dhamaal Sale: రూ.75,000 విలువైన స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే పొందండి!

Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్ కార్ట్ మరో సరికొత్త సేల్ తో కస్టమర్లను ఆకర్షించేందుకు మీ ముందుకు వచ్చేసింది. ‘బిగ్ బచత్ ధమాల్ సేల్’ పేరిట ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు నిర్వహించనున్న ఈ సేల్ లో రూ.75,000ల విలువైన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. భారీ తగ్గింపుతో రూ.25,000లకే విక్రయానికి ఉంది. అదెలాగో తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 04:19 PM IST
    • ఫ్లిప్ కార్ట్ కస్టమర్ల కోసం మరో సరికొత్త సేల్
    • బిగ్ బచత్ సేల్ పేరిట ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు నిర్వహణ
    • రూ.75 వేల విలువైన రూ.25 వేలకే విక్రయం
Flipkart Big Bachat Dhamaal Sale: రూ.75,000 విలువైన స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.25 వేలకే పొందండి!

Flipkart Big Bachat Dhamaal Sale: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు మరో సరికొత్త సేల్ తో మీ ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమైన ‘బిగ్ బచత్ ధమాల్’ సేల్ ఫిబ్రవరి 5 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లతో పాటు మరెన్నో వస్తువులు చౌకగా అందుబాటులో ఉన్నాయి. 

ఈ సేల్ లో Vu కంపెనీకి చెందిన 55 అంగుళాల స్మార్ టీవీ ఇప్పుడు భారీ తగ్గింపుతో రూ.25 వేలకే అందుబాటులోకి వచ్చింది. అయితే దీని అసలు ధర మార్కెట్లో రూ.75 వేలుగా ఉంది. మేము ముందుగా చెప్పిన విధంగా ఈ స్మార్ట్ టీవీని రూ.25 వేలకే మీ సొంతం చేసుకోవచ్చు. 

Vu ప్రీమియం స్మార్ట్ టీవీపై ఆఫర్లు

Vu కంపెనీకి చెందిన 55 అంగుళాల స్మార్ట్ టీవీ అల్ట్రా HD (4K) LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మార్కెట్ విలువ ప్రకారం రూ.75,000. అయితే ఫ్లిప్ కార్ట్ ఈ కొనుగోలుపై 49 శాతం తగ్గింపు ఇస్తుంది. ఈ తగ్గింపు తర్వాత రూ.37,999కే ఈ స్మార్ట్ టీవీ విక్రయానికి ఉంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ టీవీని కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్.. అంటే రూ.1,900 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫలితంగా ఈ స్మార్ట్ టీవీ ధర రూ.36,099గా ఉంటుంది. 

మరోవైపు ఈ డీల్‌పై కస్టమర్‌లు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందుతారు. కస్టమర్లు తమ పాత టీవీ స్థానంలో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే రూ.11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే, కస్టమర్ల కోసం ఈ స్మార్ట్ టీవీ ధర రూ.36,099 నుంచి రూ.25,099కి తగ్గుతుంది.

Vu ప్రీమియం స్మార్ట్ టీవీ ఫీచర్లు

1) డిస్ ప్లే -  Ultra HD (4K) LED స్మార్ట్ Android TV 

2) రిజల్యూషన్ - 3,840 x 2,160 పిక్సెల్స్ 

3) అప్ గ్రేడ్ రేట్ - 60 Hz 

4) సౌండ్ స్పీకర్స్ -  30W సౌండ్ అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లు.

వీటితో పాటు ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలో ఓటీటీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్ వంటివి అందుబాటులో ఉన్నాయి.  

Also Read: Cheap and Best Phone: నెలకు రూ. 500 లోపు ఈఎంఐతో సూపర్ స్మార్ట్ ఫోన్!!

Also Read: Airtel Lowest Recharge: ఎయిర్ టెల్ స్పెషల్ ఆఫర్.. ఇప్పుడు రూ.58లకే కనీస రీఛార్జ్ ప్లాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News