SBI Home Loan Interest Certificate: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank of India) ఎప్పటికప్పుడూ అప్‌డేట్ అవుతూ ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. ఇటీవల మరోసారి మెయింటనెన్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు. మరోవైపు తక్కువ వడ్డీ ధరలకే ఇంటి రుణాలు అందజేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు భారతీయ స్టేట్ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నారా, అయితే మీకు హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా.. కంగారు చెందనక్కర్లేదు. ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా ఎస్‌బీఐ క్విక్ ద్వారా హోమ్ లోన్ ఇంటరెస్ట్ కాపీని సులభంగా పొందవచ్చునని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వ్యాప్తి సమయం కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్ద కూర్చుని ఆన్‌లైన్‌లో ఈ సేవలు అందిస్తున్నామని పేర్కొంది. స్టే హోమ్, స్టే సేఫ్ అని ట్వీట్ చేసింది. 


Also Read: EPFO Benifits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి



హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ అంటే..
హోమ్ లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ అని వ్యవహరిస్తారు. మీరు ఏ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారో, ఆ బ్యాంకు లేదా సంస్థ ఈ హోమ్ లోన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపులలో మినహాయింపు కోసం హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ అవసరం ఉంటుందని తెలిసిందే. హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ డౌన్‌‌లోడ్ చేసుకునే విధానాన్ని (SBI New Services) ఇక్కడ అందిస్తున్నాం.


Step 1: ఎస్‌బీఐ నుంచి హోమ్ లోన్ తీసుకున్న వారు అధికారిక వెబ్‌సైట్ www.onlinesbi.com/personal నుంచి హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ (ప్రొవిజనల్) పొందవచ్చు


Step 2: మీ వివరాలలో ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో పర్సనల్ బ్యాంకింగ్ సెక్షన్‌లో లాగిన్ అవ్వాలి


Also Read: Gold Price In Hyderabad: నేటి మార్కెట్‌లో నిలకడగా బంగారం ధరలు, పుంజుకున్న వెండి ధరలు


Step 3: ఎంక్వైరీస్ (Enquiries) ట్యా్బ్‌కు వెళ్లాలి. అందులో హోమ్ లోన్ ఐఎన్‌టీ.సెర్ట్ (Home Loan Int.Cert (Prov)) లింక్ మీద క్లిక్ చేయాలి


Step 4: హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాల్సిన బ్యాంక్ అకౌంట్‌ను సెలక్ట్ చేయాలి


Step 5: మీ హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. అవసరమైతే దాన్ని ప్రింటౌట్ తీసుకోవడం మంచిది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook