EPFO Benefits: ఈపీఎఫ్ ఖాతాలున్నాయా, అయితే ఈ 5 EPF బెనిఫిట్స్ తెలుసుకోండి

Benefits Of EPF Account | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఖాతాలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఉన్నాయి. కానీ కొందరికి మాత్రమే వాటి ప్రయోజనాలు చాలా వరకు తెలుసు. మరికొందరు కొన్ని బెనిఫిట్స్ తెలియక ఈపీఎఫ్ ఖాతాలలో నగదు విత్‌డ్రా చేసుకుంటారు. కొందరు పీఎఫ్ ఖాతాను నగదు కోల్పోయే ఖాతాగా భావిస్తారు. అయితే ఈపీఎఫ్ ఖాతా ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ అందిస్తున్నాం.

1 /5

EPFO Benefits: EPFO రూల్స్ ప్రకారం ఉద్యోగుల బేసిక్ శాలరీలో 12 శాతం PF Accountకి ప్రతినెలా జమ కానుంది. ఉద్యోగి పనిచేసే సంస్థ సైతం అంతే మొత్తాన్ని అందిస్తుంది. 8.33 శాతం EPSకు వెళ్తుంది. పీఎఫ్ ఖాతాదారులు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రయోజనం పొందనున్నారు. ఈపీఎఫ్ ఖాతాదారుడు రిటైర్మెంట్ అయిన తర్వాత EPFO నుంచి ప్రతినెలా పెన్షన్ అందుతుంది. Also Read: EPFO ​​Latest Update: పీఎఫ్ ఖాతా, పెన్షన్ ఫండ్ వేరు చేయాలని యోచిస్తున్న కేంద్రం

2 /5

ఈపీఎఫ్ ఖాతాలున్న ప్రైవేట్, ప్రభుత్వ ఖాతాదారులకు ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యం లభిస్తుంది. దీన్ని ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(EDLI) స్కీమ్ అని వ్యవహరిస్తారు. పీఎఫ్ ఖాతాదారులకు (PF Account Holders) గరిష్టంగా రూ.6 లక్షల వరకు ఇన్సురెన్స్ లభిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాదారుడు చనిపోతే, వారి నామినీకి ఇన్సురెన్స్ నగదు అందిస్తారు. 

3 /5

Benefits Of EPF Account: ప్రతి నెలా ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలలో నగదు డిపాజిట్ చేసుకున్నా, లేకపోయినా ఈపీఎఫ్ ఖాతాలో నగదు జమ అవుతుంది. ఆ మొత్తానికిగానూ ఈపీఎఫ్ ఖాతా నుంచి వడ్డీ అందుతుంది. గతేడాది నుంచి ఈపీఎఫ్ ఖాతాల్లో నగదుకు 8.5 శాతం వడ్డీ అందిస్తోంది EPFO. ఇతర చాలా ఖాతాలతో పోల్చితే ఇది అధిక వడ్డీ.  Also Read: EPFO Alert: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త, జాబ్ కోల్పోయినా COVID-19 అడ్వాన్స్‌ నగదు సాయం

4 /5

కొన్ని సందర్భాలలో ఈపీఎఫ్ ఖాతాదారులు డబ్బు కోసం ఇబ్బంది పడతారు. కానీ ఈపీఎఫ్ ఖాతాల ద్వారా మీకు కొంత ఇబ్బంది తగ్గుతుంది. సరైన కారణాలు చూపించి ఈపీఎఫ్ మొత్తంలో కొంత మేర నగదు విత్‌త్రా చేసుకునే అవకాశం కల్పించింది. పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణాలు, జాబ్ పోవడం, పిల్లల చదువులు లాంటి పలు కారణాలతో అవసరమైన సమయంలో నగదు విత్‌గ్రా చేసుకోవచ్చు.

5 /5

Benefits Of EPF Account: ఈపీఎఫ్ ఖాతాదారులకు, ఇతర ఉద్యోగులకు ఓ వ్యాత్యాసం ఉంది. ఈపీఎఫ్ ఖాతాలలో జమ చేసే సొమ్ముకు ఆదాయపు పన్ను (Income Tax) చట్టంలోని సెక్షన్ 80 కింద 12 శాతం వరకు పన్ను మినహాయింపు సౌకర్యం కల్పించింది. కొందరు లక్షన్నర వరకు నగదుకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందుతారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook