How to Improve Cibil Score: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్‌లతో అనేక రకాల ఫీచర్లు ఉంటన్నాయి.ఉదాహరణకు,కొన్నిరకాల కార్డ్‌లు షాపింగ్ రివార్డ్‌లతో పాటు సినిమా టిక్కెట్‌లను సైతం ఆఫర్ చేస్తున్నాయి.అయితే కొన్ని కార్డ్‌లు పెట్రోల్ చార్జీలపై సబ్సిడీ,IRCTC టిక్కెట్ బుకింగ్‌పై డిస్కౌంట్ సైతం ఆఫర్ చేస్తాయి.దీంతో చాలా మంది ఈ ఆఫర్ల కోసం ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు.అయితే,ఎక్కువ కార్డులు తీసుకోవడం క్రెడిట్ స్కోర్‌ను దిగజార్చుతుంది.ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం వలన మీ క్రెడిట్ స్కోర్‌కు దెబ్బ తీయవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రెడిట్ స్కోర్ ఎలా నిర్ణయిస్తారు ?


క్రెడిట్ స్కోర్ ఆధారంగా,మీరు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఎంత ఉందో అంచనా వేయబడుతుంది.క్రెడిట్ స్కోర్‌ని నిర్ణయించేటప్పుడు ఈ ఐదు విషయాలను గుర్తుంచుకోండి :


1. చెల్లింపు చరిత్ర.


2. ఎంత క్రెడిట్ ఉపయోగించబడింది.


3. క్రెడిట్ చరిత్ర ఎంత పాతది?


4. కొత్త లోన్ లేదా లోన్ కోసం విచారణ. 


5. ఎన్ని రకాల రుణాలు తీసుకున్నారు?


క్రెడిట్ స్కోర్ ఎందుకు క్షీణిస్తుంది?


ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తే ఇది క్రెడిట్ స్కోర్ ప్రభావితం చేస్తుంది. ఈ రెండూ క్రెడిట్ స్కోర్‌లో 40 శాతం వాటాను కలిగి ఉంటాయి. మీరు రుణం కోసం అడిగినప్పుడల్లా,రుణదాత మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తారు.మీ క్రెడిట్ స్కోర్‌ని మళ్లీ మళ్లీ చెక్ చేస్తుంటే అది మరింత తగ్గుతుంది.పలు మార్లు సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం అంటే,మీరు పలుమార్లు రుణం తీసుకోవాలనుకుంటున్నారని సిబిల్ సంస్థ అర్థం చేసుకుంటుంది.అటువంటి పరిస్థితిలో డిఫాల్ట్ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.అందువల్ల క్రెడిట్ స్కోర్ క్షీణించవచ్చు.అయితే ఇది క్రెడిట్ స్కోర్‌ను కొన్ని పాయింట్ల మేర మాత్రమే మారుస్తుంది.


Also Read: Budget 2024: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్..ముద్రాలోన్ లిమిట్ రూ.20 లక్షలకు పెంపు.!!  


క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం వల్ల ఎంత తేడా ఉంటుంది?


ఒక పెద్ద అంశం రుణ వినియోగం.క్రెడిట్ స్కోర్ నిర్ధారణలో దీనికి 30 శాతం వాటా ఉంది.మీరు క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వాడినప్పుడు,అది మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది.ఉదాహరణకు మీ వద్ద రూ.1 లక్ష లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుందాం.మీరు ఆ మొత్తం పరిమితిని ఉపయోగించారని అనుకుందాం, అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ గణనీయంగా తగ్గే వీలుంది.మీరు అదే పరిమితితో మరొక క్రెడిట్ కార్డ్ తీసుకొని దాని పరిమితిలో 20 శాతం ఉపయోగిస్తుంటే,రెండవ కార్డ్ తీసుకోవడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.ఎందుకంటే, మీ మొత్తం పరిమితి రూ.2 లక్షలకు పెరిగిందని అర్థం. 


గమనించవలసిన విషయాలు: 


1. అవసరమైన దానికంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను తీసుకోకండి. 


2. క్రెడిట్ పరిమితిని పొదుపుగా ఉపయోగించండి. 


3. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం ఏ సందర్భంలోనూ మంచిది కాదు. 


4. మీకు కావాలంటే లిమిట్ పెంచుకోంది..


Also Read : Ola Electric IPO: ఆగస్టు 2 నుంచి ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో ప్రారంభం..మినిమం ఎంత వరకూ పెట్టుబడి పెట్టాలి? ఎన్ని షేర్లు కొనాలి?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter