Spicejet Offer: కేవలం 1122 రూపాయలకే దేశీయంగా విమాన ప్రయాణం, స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్ ఇదే
Spicejet Offer: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రయాణీకులకు కొత్త సంవత్సర కానుకగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్పైస్‌జెట్ స్పెషల్ వింటర్ సేల్. థర్డ్ ఏసీ ధరకు విమాన ప్రయాణ సౌకర్యం కలగనుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.
Spicejet Offer: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రయాణీకులకు కొత్త సంవత్సర కానుకగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్పైస్‌జెట్ స్పెషల్ వింటర్ సేల్. థర్డ్ ఏసీ ధరకు విమాన ప్రయాణ సౌకర్యం కలగనుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.
వావ్..వింటర్ సేల్. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ అందిస్తున్న ఆఫర్ ఇది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణీకుల కోసం ప్రకటించిన బంపర్ ఆఫర్ ఇది. జనవరి నెలలో పండుగ తరువాత నుంచి ఏప్రిల్ వరకూ ఎప్పుడైనా ఈ సౌకర్యంతో దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే..స్పైస్‌జెట్ ప్రత్యేక ఆఫర్ (Spicejet Special Offer ) గడువును కూడా పొడిగించింది. వాస్తవానికి డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 31 వరకూ ఉండాల్సిన ఆఫర్ ను జనవరి 1 వరకూ స్పైస్‌జెట్ సంస్థ పొడిగించింది. ఈ మేరకు స్పైస్‌జెట్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది.
వావ్ వింటర్ సేల్‌లో(Wow Winter Sale) భాగంగా కేవలం 1122 రూపాయలకే దేశీయ విమానాల్లో ప్రయాణించే అవకాశముంటుంది. కొత్త ఏడాదిలో ముఖ్యంగా వేసవి సమయంలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇదొక అద్భుత అవకాశమంటోంది స్పైస్‌జెట్ సంస్థ. ఎందుకంటే ఈ సౌకర్యం కింద బుక్ చేసుకున్న ప్రయాణీకులు జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకూ ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. అంతేకాదు ప్రయాణం షెడ్యూల్ మార్చాల్సి వస్తే..ఒకసారి ఉచితంగా మార్చుకునేందుకు అవకాశముంటుంది. అయితే ప్రయాణ తేదీకు కనీసం 2 రోజుల ముందు మార్చాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం స్పైస్‌జెట్ (Spicejet) అధికారిక వెబ్ సైట్ http://spicejet.com లింక్ క్లిక్ చేయాలి. అదే లింక్ క్లిక్ చేసి మీ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వావ్ వింటర్ సేల్ ప్రకారం ప్రయాణ తేదీకు కనీసం 15 రోజుల ముందు చేసిన బుకింగులకు మాత్రమే ఆఫర్ చెల్లుబాటవుతుంది. అంటే కేవలం థర్డ్ ఏసీ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. అదే సమయంలో మరో ప్రయాణం కోసం 5 వందల రూపాయల ఫ్రీ వోచర్ లభిస్తుంది. ఈ వోచర్‌ను జనవరి 15 నుంచి 31 వరకూ రిడీమ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 వరకూ ప్రయాణ కాలానికి వర్తిస్తుంది.
Also read: Todays Gold Rate: కొత్త ఏడాదిలో పెరుగుతున్న బంగారం ధర, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి