DSB Service: బ్యాంకు వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) బుధవారం శుభవార్త తెలిపింది. అదేంటంటే.. ఇంట్లో ఉండే బ్యాంకింగ్ సేవలను పొందగలిగే వైపుగా అడుగులు వేసింది. తేలిక బరువుగా ఉండే డివైస్ లను కష్టపర్లకు అందించి వారికి ఇంట్లోనే బ్యాంకింగ్ సేవలను అందజేసేవిధంగా ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ సౌకర్యం వినియోగదారులకు వారి ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవల సదుపాయాన్ని అందిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు SBI యొక్క డోర్ స్టెప్ బ్యాంకింగ్ కోసం నమోదు చేసుకున్నారా..? చేయకపోతే ఈ రోజే చేయండి. అంతేకాకుండా.. ఈ సర్వీసుతో బ్యాంకింగ్ సదుపాయాన్నీ ఇంట్లోనే ఉపయోగించవచ్చు. ఈ రోజే డోర్ స్టెప్ బ్యాంకింగ్ కోసం నమోదు చేయండి! మరిన్ని వివరాల కోసం: https://bank.sbi/dsb లేదా టోల్-ఫ్రీ నంబర్ 1800 1037 188 లేదా 1800 1213 721." కాల్ చేయండి అని ఎస్బీఐ బ్యాంకు ట్వీట్ చేసింది. 


ఎస్బిఐ చైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ..  ఆర్థిక పెరుగుదలను మెరుగుపరచడం మరియు సామాన్య ప్రజలకు అవసరమైన బ్యాంకు సేవలను అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందించటానికి మరియు సౌలభ్యం పెంచటం కోసమే అని తెలిపారు. 


'కియోస్క్ బ్యాంకింగ్' తో నేరుగా బ్యాంకింగ్ సేవలు వినియోగదారుల గుమ్మం దగ్గరకే వస్తుంది. ఈ కస్టమర్ సర్వీసెస్ సెంటర్ ఏజెంట్లకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఈ సర్వీసెస్ ద్వారా..  ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, సీనియర్ సిటిజన్లను మరియు వికాలాంగులకు సులువుగా చేరుకోటానికి సహాయపడుతుంది. ఈ కొత్త సర్వీస్ లతో డబ్బు ఉపసంహరణ, డిపాజిట్లు, డబ్బు బదిలీ, బ్యాంక్ ఖాతాలో డబ్బు మరియు లావాదేవీల అకౌంటింగ్ వంటి 5 రకాల సేవలను వినియోగించటానికి ఉపదయోగపడుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో సోషియల్ సెక్యూరిటీ స్కీం కింద ఖాతా ప్రారంభం మరియు కార్డ్ సంబంధిత సేవలను నమోదు చేయటానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. 



Also Read: World Cup 2023: ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు, ఎవరితో


SBI యొక్క DSB సేవలు


డోర్స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ (DSB) లో నగదు పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, చెక్ రిక్వెస్ట్ స్లిప్ పికప్, ఫారం 15H  పికప్, డ్రాఫ్ట్ డెలివరీ, టర్మ్ డిపాజిట్ సలహా డెలివరీ, లైఫ్ సర్టిఫికేట్ పికప్ మరియు కెవైసి డాక్యుమెంట్ పికప్ వంటి సేవలు ఉన్నాయి. 


సర్వీస్ రిక్వెస్ట్ కోసం సెంటర్ కు టోల్ ఫ్రీ నంబర్ 18001111103 వద్ద ఉదయం 9 నుండి 4 గంటల మధ్య వర్కింగ్ రోజులలో చేయవచ్చు. 


రిజిస్ట్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ హోమ్ బ్రాంచ్‌లో చేయబడుతుంది.


KYC- పూర్తైన కస్టమర్లకు డోర్స్టెప్ బ్యాంకింగ్ సేవ పూర్తిగా అందుబాటులో ఉంటుంది. 


SBI కాకుండా ఈ బ్యాంకులు కూడా DSB సేవలు అందిస్తున్నాయి


ఎస్బిఐతో పాటు, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్, సింధుఇన్ మరియు కోటక్ మహీంద్రా వంటి బ్యాంకులు కూడా తమ వినియోగదారులకు డోర్స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి.


Also Read: Eng Vs NZ Match Upadates: నేడే విశ్వకప్ ఆరంభం.. తొలి మ్యాచ్‌కు ముందు రెండు జట్లకు షాక్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook