World Cup 2023: వన్డే వరల్డ్ కప్ 2023 తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌లు అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా షెడ్యూల్ ఇలా ఉంది
ఇండియా ఆతిధ్యమిస్తున్న ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 8న చెన్నై వేదికపై ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆ తరువాత రెండవ మ్యాచ్ అక్టోబర్ 11వ తేదీన న్యూ ఢిల్లీ వేదికపై ఆప్ఘనిస్తాన్‌తో ఆడనుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఢీ కొననుంది. ఇక అక్టోబర్ 19వ తేదీన పూణే వేదికపై బంగ్లాదేశ్‌తో, అక్టోబర్ 22న ధర్మశాల వేదికపై న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 29న లక్నో వేదికపై ఇంగ్లండ్‌తో, నవంబర్ 2న ముంబై వేదికపై శ్రీలంకతో, నవంబర్ 5న కోల్‌కతా వేదికపై దక్షిణాఫ్రికాతో, నవంబర్ 12 బెంగళూరు వేదికపై నెదర్లాండ్స్‌తో జరగనున్నాయి.
ప్రపంచకప్ 2023 లీగ్ దశలో టీమ్ ఇండియా ఆడనున్న 9 మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లు ఆదివారం జరగనున్నాయి. ఇండియా ఆడే మ్యాచ్‌లన్నీ మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఆదివారం సెలవు రోజు ఇండియా ఆడే మ్యాచ్‌లు ఐదు ఉండటంతో క్రికెట్ ప్రేమికులకు సంతోషంగా ఉంది.
వరల్డ్ కప్ 2023 టీమ్ ఇండియా
రోహిత్ శర్మ ( కెప్టెన్ ), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్న అశ్విన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్
Also read: ICC Cricket World Cup 2023: ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలి..? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook