E‌‌-Commerce sales jump, Amid Omicron fear Online Sales Increase By 15% In A Week : కోవిడ్‌ థర్డ్‌ వేవ్ తరుముకొస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా వైరస్ (Corona virus) ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తోంది. తాజాగా దేశంలో లక్షకు పైగా కోవిడ్ (Covid) కొత్త కేసులు నమోదుకావడంతో థర్డ్ వేవ్‌ (Third wave) తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. కోవిడ్‌ కేసులు (Covid‌ cases) భారీగా పెరిగిపోతుండంతో పాటు మరోవైపు ఒమిక్రాన్‌ భయాందోళనలు ఉండడంతో ఫిజికల్‌ స్టోర్స్‌కు వెళ్లేందుకు జనాలు భయపడుతున్నారు. ఇక ఇప్పటికే మన దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా (Corona) ఆంక్షలు అమ​లు అవుతున్నాయి. దీంతో జనాలంతా నిత్యావసరాలను ఆన్‌లైన్‌లో కొనేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌లలో (E-Commerce Websites) అమ్మకాలు పెరిగాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో పాటు సబ్బులు, హైజీన్ ప్రోడక్ట్స్‌, తదితర వస్తువుల అమ్మకాలు ఈ‌‌-కామర్స్ ప్లాట్‌ఫాట్స్‌లలో (E-Commerce Platforms) పెరిగాయి. గత వారం రోజుల్లో ఈ‌‌-సేల్స్ భారీగా జరిగాయి. 


2020 ప్రారంభం అయినప్పటి నుంచీ ఒమిక్రాన్‌ భయంతో పాటు కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ప్రజలు ఇంటి సరుకుల కోసం బయట షాపులకు వెళ్లడం లేదు. దీంతో నిత్యావసరాలతో పాటు ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ ఇతర సరుకుల కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌‌ చేస్తున్నారు.


అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌ బాస్కెట్‌, బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్స్‌లలో నిత్యావసర సరుకులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు విధించే అవకాశం ఉందని చాలా మంది ముందుగానే ఇంట్లోకి కావాల్సిన సరుకులను, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ను ఆర్డర్‌‌ చేస్తున్నారు. దీంతో గత వారంలో 10 నుంచి 15 శాతం వరకు ఈ‌‌-కామర్స్ (E-commerce) ప్లాట్‌ఫాట్స్‌లలో అమ్మకాలు పెరిగాయి. చాకోలెట్స్, బెవరేజస్ సేల్స్ డబుల్ అయ్యాయి. కోవిడ్ ఫస్ట్, సెకెండ్ వేవ్స్ సమయంలోనూ జనాలు ఇలాగే నిత్యావసర సరుకులు కొనేశారు. ప్రస్తుతం మళ్లీ థర్డ్‌ వేవ్ (Third wave) మొదలుకావడంతో ఈ‌‌-కామర్స్ ప్లాట్‌ఫాట్స్‌లలో కొనుగోళ్లు పెంచారు. 


Also Read : Mumbai mini Lockdown: ముంబయిలో మినీ లాక్​డౌన్​.. త్వరలోనే నూతన మార్గదర్శకాలు..


ప్రస్తుతం మళ్లీ హైజీన్‌ ప్రోడక్ట్స్‌కు (Hygiene Products) డిమాండ్ పెరిగింది. శానిటైజర్స్, హ్యాండ్‌వాష్‌, క్లీనింగ్‌ లిక్విడ్స్‌తో పాటు మాస్కులకు డిమాండ్ ప్రారంభమైంది. ఒమిక్రాన్‌ (Omicron) వల్లే ప్రస్తుతం హైజీన్‌ ప్రోడక్ట్స్‌కు డిమాండ్ పెరిగింది.


Also Read : PM Security Breach: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి