Omicron Death: ఒమిక్రాన్ డేంజర్ బెల్స్.. కొత్త వేరియంట్‌తో దేశంలో రెండో మరణం...

Omicron Second Death in India : ఒమిక్రాన్ బలిగొన్న ఆ ఒడిశా మహిళకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం గమనార్హం. డిసెంబర్ 22న అనారోగ్యానికి గురైన ఆ మహిళ భోమా భోయి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేరింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 10:06 AM IST
  • దేశంలో ఒమిక్రాన్ కారణంగా రెండో మరణం
  • ఒడిశాలోని బాలంగిర్ జిల్లాలో 55 ఏళ్ల మహిళ మృతి
  • ఇటీవల కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిన బాధితురాలు
  • చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి
Omicron Death: ఒమిక్రాన్ డేంజర్ బెల్స్.. కొత్త వేరియంట్‌తో దేశంలో రెండో మరణం...

Omicron Second Death in India : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron cases) కారణంగా దేశంలో రెండో మరణం సంభవించింది. ఒడిశాలోని బాలంగిర్ జిల్లాకు చెందిన ఓ మహిళ (55) ఒమిక్రాన్ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఒడిశాలో ఒమిక్రాన్ కారణంగా సంభవించిన తొలి మరణం ఇదే కావడం గమనార్హం. రెండు రోజుల క్రితమే దేశంలో తొలి ఒమిక్రాన్ మరణాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.

ఒమిక్రాన్ బలిగొన్న ఆ ఒడిశా మహిళకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం గమనార్హం. డిసెంబర్ 22న అనారోగ్యానికి గురైన ఆ మహిళ భోమా భోయి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేరింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆమెను బుర్లా ఆసుపత్రికి తరలించారు. డిసెంబర్ 23న ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌ పరీక్షలకు పంపించారు.

ల్యాబ్ రిపోర్ట్స్ ఇంకా రాకముందే డిసెంబర్ 27న ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్‌లో ఆమెకు ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడైంది. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం మృతురాలి స్వగ్రామం అగల్‌పూర్‌లో వైద్య సిబ్బంది ఆమె కాంటాక్ట్స్‌ను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఒడిశాలో ఇప్పటివరకూ 61 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 24 కేసులు బుధవారం (జనవరి 5) ఒక్కరోజే నమోదవడం గమనార్హం.

ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 2630 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 797 కేసులు, ఢిల్లీలో 465, రాజస్తాన్‌లో 236 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం రాజస్తాన్‌లోనే నమోదైన సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌కి చెందిన 74 ఏళ్ల వృద్దుడు ఒమిక్రాన్ బారినపడి గత వారం మృతి చెందాడు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని చెబుతున్నప్పటికీ... ఒమిక్రాన్ కారణంగా సంభవిస్తున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read: WHO on Omicron: 'ఒమిక్రాన్‌'పై ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News