Electric Scooter: రూ. 79లోపే 170 కి.మీ మైలేజీ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. కళ్లు చెదిరే ఫీచర్స్ ఇవే!
iVOOMi JeetX ZE Electric Scooter: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇది JeetX ZE పేరుతో మార్కెట్లోకి విడుదలైంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
iVOOMi JeetX ZE Electric Scooter: అతి తక్కువ బడ్జెట్ లోనే మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయం గా భావించవచ్చు. ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ iVOOMi మార్కెట్లోకి లాంచ్ చేసిన JeetX ZE మోడల్ స్కూటర్కు రోజుల వ్యవధిలోనే మంచి ప్రజాదరణ లభించింది. ఈ బైక్ వివిధ రకాల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ బైక్ 2.1kWh, 2.5kWh బ్యాటరీ వేరియంట్‌లో లభిస్తోంది. అలాగే ఈ స్కూటర్లు అనేక రకాల కొత్త కొత్త ఫీచర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే మార్కెట్లో ఈ స్కూటర్‌తో పాటు వివిధ రకాల ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా దీని ధరలకే లభిస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఏయే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అతి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీతో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
iVOOMi JeetX ZE ధర:
ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటీ 8 విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది అంతేకాకుండా కొత్త కొత్త వేరియంట్స్ కూడా ఇందులో లభిస్తున్నాయి. ఈ స్కూటర్ ధర రూ. 79,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కాగా కొన్ని ప్రాంతాల్లోని ఈ స్కూటర్ మరింత తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా iVOOMi కంపెనీ త్వరలోనే మరికొన్ని స్కూటర్స్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
iVOOMi JeetX ZE ఫీచర్లు:
ఈ iVOOMi JeetX ZE ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక రకాల కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో అద్భుతమైన టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఉండడమే కాకుండా.. బ్లూటూత్ కనెక్టివిటీతో కాల్ మాట్లాడుకోవడానికి, మెసేజ్ నోటిఫికేషన్ కోసం ప్రత్యేకమైన ఫీచర్ ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్కూటర్ కు సంబంధించిన డ్రైవింగ్ రేంజ్ విషయానికొస్తే.. దీనిని ఒక్కసారి చార్జి చేస్తే దాదాపు 170 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా అదనంగా మరింత మైలేజీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
iVOOMi JeetX ZE కంటే చౌక ధరలో లభించే స్కూటర్స్:
Ola S1X ధర:
భారత మార్కెట్లో ఈ Ola ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 69,999 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది ఇది 2000 వాట్స్ బ్యాటరీ కెపాసిటీ తో అందుబాటులోకి వచ్చింది దీనిని ఒక్కసారి చాట్ చేస్తే దాదాపు 95 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది అలాగే ఇందులో ఇంకో వేరియంట్ కూడా అందుబాటులో ఉంది ఇది 3000 వాట్స్ బ్యాటరీ కెపాసిటీతో అందుబాటులోకి వచ్చింది దీనిని ఒక్కసారి చాట్ చేస్తే దాదాపు 143 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
Ola S1X Plus ధర:
ప్రస్తుతం భారత మార్కెట్లో Ola S1X Plus ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా మంచి ప్రజాదరణ ఉంది. ఇది ఆటోమొబైల్ మార్కెట్ రూ. 89,999 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇక దీని బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది 3000 వాట్స్ కెపాసిటీ కలిగిన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది ఈ ఎలక్ట్రిక్ బైక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 151 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి