Electricity Bill fraud: ఆన్లైన్ కరెంటు బిల్లు చెల్లిస్తున్నారా..జాగ్రత్త, ఒక్క క్లిక్‌తో ఎక్కౌంట్ ఖాళీ కావచ్చు
Electricity Bill fraud: ప్రతి నెలా కరెంటు బిల్లు ఆన్లైన్లో చెల్లిస్తున్నారా..అయితే మీకు అప్రమత్తత చాలా అవసరం. లేకుంటే ఒక్క క్లిక్‌తో మీ ఎక్కౌంట్ మొత్తం ఖాళీ కావచ్చు. తస్మాత్ జాగ్రత్త.
ఇటీవలి కాలంలో అన్ని రకాల బిల్స్ ఆన్‌లైన్‌లోనే చెల్లించేస్తున్నాం. ముఖ్యంగా కరెంటు బిల్లులు. ఇప్పుడు మీరు జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే హ్యాకర్లు దృష్టి దానిపై పడింది. కేవలం మీ ఒక్క క్లిక్ మొత్తం ఎక్కౌంట్ ఖాళీ చేస్తుంది.
ఒకవేళ మీ మొబైల్‌కు కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామనే మెస్సేజ్ వస్తే ఏ మాత్రం కంగారు పడవద్దు. ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి మెస్సేజ్‌లు పంపించేది కేవలం హ్యాకర్లే. కరెంటు బిల్లు కట్టేందుకు ఈ మెస్సేజ్ ద్వారా హ్యాకర్లు ఒక లింక్ పంపిస్తారు. మీరు పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే..మీ ఎక్కౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అందుకే కరెంటు బిల్లు, క్యాష్‌బ్యాక్ లేదా ఆఫర్లకు సంబంధించిన మెస్సేజ్ వస్తే జాగ్రత్త అవసరం. ఇలాంటి మెస్సేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ఎస్బీఐ కూడా ఈ విషయమై ట్వీట్ చేసింది.
చాలామందికి వాట్సప్ లేదా కొత్త నెంబర్ల నుంచి మెస్సేజ్‌లు వస్తుంటాయి. మీరు వెంటనే ఇచ్చిన నెంబర్‌కు ఫోన్ చేయకపోతే కరెంట్ సరఫరా నిలిపివేస్తామని మెస్సేజ్‌లు వస్తుంటాయి. ఇంకొంతమందికి..మీ ఇంటికి విద్యుత్ సరఫరా ఇవాళ రాత్రి 8.30 నిమిషాలకు కట్ చేస్తామని..ఎందుకంటే గత నెల బిల్లు అప్‌డేట్ కాలేదని మెస్సేజ్ వస్తుంటుంది. ఇలాంటి మెస్సేజ్‌లకు స్పందించవద్దు.
ఇలాంటి మెస్సేజ్‌ల విషయంలో ఎస్బీఐ కూడా అలర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. డూప్లికేట్ మెస్సేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎప్పుడూ వచ్చిన మెస్సేజ్‌లకు రిప్లై లేదా ఫోన్ చేయడం చేయవద్దని కోరుతోంది.
ఇలాంటి మెస్సేజ్‌లు చూడగానే నమ్మాలన్పిస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే గానీ తప్పుడు మెస్సేజ్ అని అర్ధం కాదు. మెస్సేజ్‌లో స్మాల్, క్యాపిటల్ లెటర్స్ కలిపి ఉండటం లేదా కామాలు వంటివి ఉండటం గమనించవచ్చు. ఇలాంటి మెస్సేజ్‌ల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి మెస్సేజ్‌లు లేదా లింక్‌లకు ఏమాత్రం మీరు స్పందించినా మీ ఎక్కౌంట్ క్షణాల్లో ఖాళీ అయిపోతుంది.
Also read: Multibagger Stocks: దీపావళికి బంపర్ ఆఫర్, నెలరోజుల్లో రెట్టింపైన షేర్ ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook