Prices Hike: నూతన సంవత్సరంలో గృహోపకరణాల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇన్‌పుట్ ఖర్చుల్లో భారం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఏయే వస్తువులు..ఎప్పటి నుంచి ఎంతమేర పెరగనున్నాయో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్. కొత్త సంవత్సరంలో గృహోపకరణాల ధరలు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల రేట్లు పెద్దఎత్తున పెరగబోతున్నాయి. ముడి సరుకు, రవాణా ఖర్చులు వంటి ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో ఆ ప్రభావమంతా ధరలపై పడనుంది. ఎలక్ట్రానిక్ కన్జ్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల తయారీదారులు రిటైల్ ధరల్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి, మార్చ్ 2022 నాటికి 5 నుంచి 10 శాతం ధరలు పెరిగే అవకాశాలున్నాయి.


ప్రముఖ కంపెనీలు LG,Panasonic,Haier వంటి కొన్ని బ్రాండ్‌ల ధరల్ని ఇప్పటికే ఆ కంపెనీలు పెంచేశాయి. గోద్రెజ్, సోనీ, హిటాచీ వంటి కంపెనీలు మాత్రం మార్చ్ నాటికి పెంచేందుకు సిద్ధమౌతున్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫ్యాక్చర్ అసోసియేషన్ అందించిన సమాచారం మేరకు..జనవరి-మార్చ్ మధ్య కాలంలో వివిధ కంపెనీల విధి విధానాలకు అనుగుణంగా 5-7 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు , ఏసీ కేటగరీల్లో ఉత్పత్తుల్ని 3-5 శాతం పెంచేందుకు Haier కంపెనీ యోచిస్తోంది. అటు పానాసోనిక్ ఏసీ ధరల్ని 8 శాతం వరకూ పెంచింది ఆ కంపెనీ. గృహోపకరణాల విషయంలో ధరల్ని పెంచేందుకు ఎల్జీ నిర్ణయించింది. ధరల పెరుగుదల తప్పనిసరి కావడంతో జాన్సన్ అండ్ జాన్సన్, హిటాచీ ఎయిర్ కండీషనింగ్ బ్రాండ్ల ధరలు ఏప్రిల్ నాటికి దశలవారీగా పది శాతం వరకూ పెరగవచ్చు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా హ్యూమన్ రిసోర్సెస్ అందుబాటులో లేకపోవడంతో ఉత్పత్తిలో జాప్యం కలిగింది. ఫలితంగా ప్రొడక్టివిటీ కాస్ట్ బాగా పెరిగింది.


Also read: Google Chrome Update: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను వెంటనే అప్డేట్ చేసుకోండి! లేదంటే ఇక అంతే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.