EPF Passbook Download: ఈపీఎఫ్ పాస్‌బుక్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అందించే ఆన్‌లైన్ సౌకర్యం. బ్యాంక్ పాస్‌బుక్‌ తరహాలోనే దీనిపై ప్రతినెలా జమ అయిన నగదు వివరాలు కనిపిస్తాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్ పాస్‌బుక్ (EPF Passbook) ద్వారా బ్యాలెన్స్ వివరాలు తెలుసుకునే వీలుంటుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


EPF వడ్డీ రేటు మీ ఖాతాకు జమ అయిందో, లేదో మీరు సులువుగా చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి ఈపీఎఫ్ ఖాతా ఉంది. వీరికి ఈ ఖాతాలో జమ అయిన నగదుపై 8.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈపీఎఫ్ఓ పాస్‌బుక్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ముందు, ఈపీఎఫ్ ఖాతాదారులు దాని యూఏఎన్ (Universal Account Number)ను యాక్టివేట్ చేసుకోవాలి. 


Also Read: Big Update: రైల్వే ప్రయాణికులకు IRCTC గుడ్ న్యూస్, చోరీ జరిగితే మీకు పరిహారం



ఈపీఎఫ్ఓ(EPFO Latest Update) ఖాతారులు తమ అకౌంట్‌కు ప్రతినెలా నగదు జమ వివరాలతో పాటు కంపెనీ మారిన సమయంలో పాత కంపెనీ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం లాంటివి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ http://epfindia.gov.in/లో అందుబాటులో ఉంటాయి. ఈపీఎఫ్ పాస్‌బుక్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి. 


- ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి http://epfindia.gov.in/


- ఈపీఎఫ్ హోం పేజీలో e-Passbookను క్లిక్ చేయండి


- మీ యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చాను ఎంటర్ చేయండి


- EPF వెబ్‌సైట్‌లో మీ పేరిట ఉన్న అన్ని ఈపీఎఫ్ మెంబర్ ఐడీలు కనిపిస్తాయి. ఒక్కో మెంబర్ ఐడీపై క్లిక్ చేస్తే ఆ కంపెనీలో మీ ఈపీఎఫ్ పాస్‌బుక్ వస్తుంది.


- మీకు క్లిక్ చేసిన ఈపీఎఫ్ మెంబర్ ఐడీ వివరాలు వస్తాయి. అందులో ఉద్యోగి వాటా పీఎఫ్ కంట్రిబ్యూషన్‌తో పాటు ఆఫీసు ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తున్న వివరాలు కనిపిస్తాయి. స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.


Also Read: 7th Pay Commission: ఎల్‌టీసీ అలవెన్స్‌ చెల్లింపులపై 7వ వేతరణ సంఘం గుడ్ న్యూస్



ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవాలనే ఖాతాదారులు ఆ సమయంలో ఉద్యోగి అయి ఉండాలి. వారి యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ తెలియాలి. తొలిసారి అయితే యూఏఎన్ యాక్టివేట్ అయిన 6 గంటల తర్వాత మాత్రమే ఈపీఎఫ్ పాస్‌బుక్ వివరాలు చూసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.


Also Read: WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook