Big Update: రైల్వే ప్రయాణికులకు IRCTC గుడ్ న్యూస్, చోరీ జరిగితే మీకు పరిహారం

Big Update For IRCTC Passengers: తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు  తిరిగి పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ విషయంతో పాటు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) తమ ప్రయాణికులకు శుభవార్తను అందించింది

Written by - Shankar Dukanam | Last Updated : Jan 29, 2021, 03:18 PM IST
  • దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు
  • ఫిబ్రవరి 14 నుండి వారానికి 4 రోజులు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు
  • ప్రయాణం సమయంలో చోరీ జరిగితే మీకు ఐఆర్‌సీటీసీ పరిహారం
Big Update: రైల్వే ప్రయాణికులకు IRCTC గుడ్ న్యూస్, చోరీ జరిగితే మీకు పరిహారం

IRCTC Latest Update: దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు  తిరిగి పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 14 నుండి వారానికి 4 రోజులు తేజస్ ఎక్స్‌ప్రెస్ తన సేవల్ని అందించనుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ ఛార్జీలతో తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించవచ్చు. మొదటి 40 శాతం సీట్లు విక్రయాలు జరిగిన తర్వాత ఫ్లెక్సీ ఛార్జీలు ప్రారంభం కావడం విశేషం.

రైల్వే ప్రయాణికులకు మరో ఆసక్తికర విషయాన్ని  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC Latest Update) అందించింది. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రయాణీకుల ఇంట్లో దొంగతనం జరిగితే అందుకు పరిహారం సైతం చెల్లించనున్నట్లు ప్రకటించింది. రైలు ప్రయాణ సమయంలో ప్రయాణీకుల ఇంట్లో జరిగిన దొంగతనంపై లక్ష రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వనున్నారు. 

Also Read: Budget 2021 Live Updates: రాష్ట్రపతి Ram Nath Kovind బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

ఫిబ్రవరి 14 నుండి తిరిగి సేవల్ని అందించనున్న తేజస్ ఎక్స్‌ప్రెస్(Tejas Express Train Sevices) శుక్రవారం, శనివారం, ఆదివారం మరియు సోమవారం నడుస్తుంది. ఐఆర్‌సీటీసీ నవంబర్ 23, 2020 నుండి తేజస్ ఎక్స్‌ప్రెస్ సేవల్ని తిరిగి ప్రారంభించాలని యోచించింది. అయితే ప్రయాణికుల కొరత కారణంగా లక్నో- ఢిల్లీ మరియు ముంబై-అహ్మదాబాద్ మధ్య అందిస్తున్న సర్వీసులను రద్దు చేసింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఆపరేషన్ నిలిపివేసిన తరువాత తేజాస్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్‌లో తిరిగి ప్రారంభించం తెలిసిందే.

Also Read: International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగించిన DGCA

ప్రయాణికుల కొరత కారణంగా అన్ని తేజస్ రైళ్ల సర్వీసులను రద్దు చేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. లక్నో-న్యూఢిల్లీ (82501/82502) తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను నవంబర్ 23 నుంచి రద్దు చేయగా, అహ్మదాబాద్-ముంబై (82901/82902) మార్గంలో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవల్ని నవంబర్ 24 నుంచి రద్దు చేశారు.

Also Read: WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి

కరోనా వైరస్(CoronaVirus), లాక్‌డౌన్ కారణంగా తొలుత తేజస్ ఎక్స్‌ప్రెస్ సేవల్ని నిలిపివేశారు. పండుగ సీజన్ల అవసరాల నిమిత్తం అక్టోబర్ 17 నుండి తిరిగి ప్రారంభించిన ఈ రెండు రైలు సర్వీసులు ప్రయాణికులు ఆశించినంత మేర లేకపోవడంతో నవంబర్ నుంచి రద్దు చేసిన సర్వీసులను తాజాగా పునరధరించనున్నారు. ఫిబ్రవరి 14 నుండి తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను కరోనా నిబంధనల నేపథ్యంలో నడపడానికి ఐఆర్‌సీటీసీ పలు చర్యలు తీసుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News