ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించింది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను పీఎఫ్ శాఖలోని కొంతమంది ఉద్యోగులకు లభించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగులకు ఇప్పుడు దీవాళి బోనస్ సమయం. చాలామందికి ఇప్పటికే అందేసింది. ఇప్పుడు తాజాగా ఈపీఎఫ్ఓ సిబ్బందికి కూడా బోనస్ ప్రకటించారు.సెలవుల కంటే ముందే సిబ్బందికి దీపావళి బోనస్ ప్రకటితమైంది. ఈ బోనస్ గ్రూప్ సి, గ్రూప్ బి అంటే నాన్ గెజిటెడ్ సిబ్బందికి ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్‌గా అందనుంది. 


బోనస్ ఎవరికి, ఎంత


అర్హులైన ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు 60 రోజుల జీతం బోనస్‌గా లభించనుంది. అది గరిష్టంగా 13,806 రూపాయలుంటుంది. ఈపీఎఫ్ఓ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను అర్హులైన గ్రూప్ సి, గ్రూప్ బి ఉద్యోగులకు 2021-22 సంవత్సరానికి 60 రోజుల జీతం గరిష్టంగా 13,806 రూపాయలు అందనున్నాయి. 


దీనికి సంబంధించి అడ్వాన్స్‌ను సంబంధిత ఉద్యోగులు తీసుకోవచ్చు. ఈ అడ్వాన్స్ 2021-22కు సంబంధించిన ప్రకటిత ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ నుంచి అడ్జస్ట్ చేస్తారు. దీపావళికి కొద్దిరోజుల ముందు ఇటీవలే ఈపీఎఫ్ఓ అర్హులైన గ్రూడ్ సి, గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ జారీ చేసింది. 


గ్రూప్ సి, గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఉద్యోగులు తాత్కాలిక ప్రాతిపదికన ఉన్నా..శాశ్వత ప్రాతిపదికన ఉన్నా సరే..2021-22 మార్చ్ చివరి రోజు వరకూ ప్రో రేటా బేసిస్ ప్రకారం అర్హులైతే కచ్చితంగా బోనస్ అందుతుంది. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, అదనపు ఉద్యోగులకు మాత్రం బోనస్ వర్తించదు. 


Also read: Flipkart Sale Smartphone Offers : ఫ్లిప్ కార్ట్ సేల్.. రూ. 35 వేల ఫోన్..కేవలం రూ. 6 వేలకే.. ఇలా త్వరపడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook