Benefits Of Having EPF Account | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఖాతాను కలిగి ఉంటారు. దీని వల్ల ఉద్యోగులు నెలవారీ నగదు సేవింగ్స్ సహా పలు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉద్యోగి జీతం నుంచి ప్రతినెలా కొంత మొత్తం పీఎఫ్ ఖాతాకు చేరుతుంది. అదే విధంగా సంస్థ సైతం పీఎఫ్ ఖాతా(EPF Account)తో పాటు పెన్షన్ స్కీమ్‌కు నగదు జమ చేస్తుంది. అయితే పీఎఫ్ ఖాతాదారులకు కలిగే బెనిఫిట్స్ తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


8.50 శాతం వడ్డీ
ప్రతి నెలా ఉద్యోగి బేసిక్ శాలరీ నుంచి 12 శాతం, ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ సైతం 12శాతం నగదును ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్(EPF) ఖాతాకు జమ చేస్తుంది. ఇందులో పీఎఫ్ ఖాతాకు జమ అయ్యే నగదు నగదుకిగానూ EPFO తమ ఖాతాదారులకు వడ్డీ అందిస్తుంది. ప్రస్తుతం ఓ ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం వడ్డీ ఈపీఎఫ్ ఖాతాదారులకు లభిస్తుంది. 


Also Read: PF Balance Check: మీ ఖాతాల్లోకి వడ్డీ జమ.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి



ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(EDLI)
ఈపీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు. ఈ విధంగా వచ్చే దాన్ని ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(EDLI) స్కీమ్ అని పిలుస్తారు. పీఎఫ్ ఖాతాదారులకు గరిష్టంగా రూ.6 లక్షల వరకు బీమా లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈపీఎఫ్ ఖాతాదారుడు చనిపోతే, ఆ ఉద్యోగి నామినీకి నగదు మొత్తం అందనుంది. 


Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి



ప్రతినెలా పెన్షన్
పీఎఫ్ ఖాతాదారులు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రయోజనం పొందనున్నారు. EPFO చట్టం ప్రకారం ఉద్యోగుల బేసిక్ శాలరీలో 12 శాతం మరియు డీఏ మొత్తం PF Accountకి ప్రతినెలా జమ కానుంది. ఉద్యోగి యాజమాన్య కంపెనీ సైతం అంతే మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తాయి. ఇందులో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌(EPS)కు వెళ్తుంది. ఈపీఎఫ్ ఖాతాదారుడు రిటైర్మెంట్ అయిన తర్వాత EPFO నుంచి ప్రతినెలా పెన్షన్ అందుతుంది. 


Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు!



పన్ను మినహాయింపు 
ఇతర ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంటుంది. పీఎఫ్ ఖాతా ఉన్నవారికి ఆదాయపు పన్నులో మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను (Income Tax) చట్టంలోని సెక్షన్ 80 కింద 12 శాతం వరకు పన్ను మినహాయింపు సౌకర్యం ఉంది. తాజాగా అమలు కానున్న కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే మాత్రం ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తించవు.


Also Read: PF Balance Missed Call Number: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు.. ఒక్క మిస్డ్ కాల్ చాలు



నగదు విత్‌డ్రా 
కొన్ని ముఖ్యమైన సందర్భాలలో, మీకు అవసరం ఉన్న సందర్భంలో మీ పీఎఫ్ మొత్తంలో కొంత మేర నగదు విత్‌త్రా చేసుకునే అవకాశం ఉంటుంది. నూతన ఇంటి నిర్మాణం, లేక వివాహాలు లాంటి కొన్ని ముఖ్య పనులకు పీఎఫ్ నగదును సైతం విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook