EPFO Closed 71.01 Lakh EPF Accounts: గత ఏడాది కరోనా వైరస్ భారత్‌లో తీవ్రంగా ప్రభావం చూపింది. రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌వో 71.01 లక్షల ఈఫీఎఫ్ ఖాతాలు తొలగించడమే అందుకు సాక్ష్యంగా మారింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలల మధ్య కాలంలో ఏడు మిలియన్ల మంది కరోనా వైరస్, లాక్‌డౌన్ లాంటి విషయాల కారణంగా ఉద్యోగాలు కోల్పోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 66.66 లక్షల ఈపీఎఫ్ ఖాతాలు మూసేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ పార్లమెంట్‌కు సోమవారం తెలిపారు. 2020లో ఏప్రిల్ -  డిసెంబర్ మధ్య కాలంలో Employees Provident Fund 71,01,929 ఖాతాలు మూసివేసనట్లు లోక్‌సభలో ఓ ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధనమిచ్చారు. భారత్ వ్యాప్తంగా గత ఏడాది మార్చి 25న లాక్‌డౌన్ విధించడం తెలిసిందే. 2019లో ఏప్రిల్ -  డిసెంబర్ మధ్య కాలంలో 66,66,563 ఈపీఎఫ్ ఖాతాలు మూసివేసినట్లు పేర్కన్నారు.


Also Read: Gold Price Today: మార్కెట్‌లో నేడు స్థిరంగా బంగారం ధరలు, పుంజుకున్న Silver Price


2020లో ఏప్రిల్ -  డిసెంబర్ మధ్య కాలంలో 1 కోటీ 27 లక్షల 72 వేల 120 ఈపీఎఫ్‌ ఖాతాల నుంచి కొంతమేర నగదు విత్ డ్రా చేసుకున్నారు. కాగా, అంతకు ముందు ఏడాది అదే సమయంలో 54,42,884 Provident Fund ఖాతాల నుంచి నగదు ఉపసంహరించుకున్నారు. 2019లో రూ.55,125 కోట్ల నగదు విత్‌డ్రా చేసుకోగా, గత ఏడాది అదే సమయంలో రూ.73,498 కోట్ల నగదు విత్‌డ్రా చేసుకున్నారని మంత్రి గంగ్వార్ లోక్‌సభలో వెల్లడించారు. 


Also Read: EPFO: ఖాతాదారులు కంపెనీ మారుతున్నారా, ఇకనుంచీ EPF Transfer తలనొప్పి ఉండదు


ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన(ABRY)లో భాగంగా 1.83 లక్షల కొత్త సంస్థలు ఏర్పాటు కాగా, వాటిలో ఫిబ్రవరి 28, 2021 నాటికి 15.30 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు. అదే సమయం వరకు ఆత్మనిర్భర్ భారత్‌తో భాగంగా రూ.186.34 కోట్లు విడుదల చేసినట్లు తన సమాధానంలో పేర్కొన్నారు.


ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ETF)లో రూ.27,532.39 కోట్ల నగదును ఫిబ్రవరి 28, 2021 నాటికి ఈపీఎఫ్‌వో ఇన్వెస్ట్ చేసింది. 2018-19 మధ్య కాలంలో రూ.27,743.19 కోట్లు, 2019-20 మధ్య కాలంలో రూ. 32,377.26 కోట్ల నగదును పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో 31,01,818 ఖాతాదారుల క్లెయిమ్స్ సెటిల్ చేశారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook