EPFO e-nomination: చందాదారులకు ఈపీఎఫ్​ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-నామినేషన్​ దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 తర్వాత కూడా అవకాశం ఉంటుందని (EPFO e-nomination extended) స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరి తేదీ 31 అనే ఉద్దేశంతో ఒకేసారి పెద్ద ఎత్తున చందాదారులు ఈ-నామినేషన్ దాఖలుకు ప్రయత్నించగా.. ఈపీఎఫ్​ వెబ్​సైట్ ఒపెన్ కావడం లేదు. ఈ సమస్యపై పలువురు చందాదారులు ఈపీఎఫ్​ఓను సంప్రదించారు. ఈ నేపథ్యంలో సబ్​స్క్రైబర్లు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. డిసెంబర్​ 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ చేయొచ్చని వివరించింది. అయితే వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయడం మేలను సూచించింది.



ఇంతకీ ఏమిటి ఈ-నామినేషన్ (What is EPFO e-nomination)​?


చందాదారులలకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ.. డిపాజిట్​ లింక్డ్ ఇన్సూరెన్స్​ స్కీమ్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం.. చందాదారులు అర్ధాంతరంగా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.7 లక్షల వరకు (గరిష్ఠంగా) బీమా చెల్లిస్తారు.


అయితే ఈ బీమాను క్లెయిమ్​ చేసుకునే వ్యక్తి ఎవరనేది చందాదారుడే నిర్ణయించి ఉండాలి. ఇందుకోసం ఆన్​లైన్​ ద్వారా నామినేషన్​ను దాఖలు చేయాలి. దీనినే ఈ-నామినేషన్ అంటారు. నామినీగా ఇద్దరు, ముగ్గురు కూడా ఉండొచ్చు.


ఈపీఎఫ్​ ఆఫీస్​కు వెళ్లకుండా.. నేరుగా ఆన్​లైన్​లోనే బీమా క్లెయిమ్ చేసుకునేందుకు ఈ-నామినేషన్ ఉపయోగపడుతుంది.


దాఖలు చేయడం ఎలా(How to file  EPFO e-nomination)..


  • ఈపీఎఫ్​ఓ అధికారిక వెబ్​సైట్​లోకి లాగిన్​ అవాలి

  • సర్వీస్​ సెక్షన్​లో.. ఫర్ ఎంప్లాయిస్ ఆప్షన్​ను ఎంచుకోవాలి

  • ఇందులో ఆన్​లైన్​ సర్వీసెస్​ను క్లిక్ చేయాలి

  • ఇందులో యూఏఎన్​ ఐడీ, పాస్​వర్డ్​తో లాగిన్ అవ్వాలి

  • ఇక్కడ మీకు ఈ-నామినేషన్ ఆప్షన్ కనిపిస్తుంది

  • ఇందులో ఫ్యామిలి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది (ఇక్కడ ఎవరు ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అనే వివరాలు సమర్పించాలి)

  • సెల్ఫ్​ డిక్లరేషన్​ సమర్పించి.. ఈ సైన్ బటన్​ క్లిక్​ చేయాలి

  • మీ మొబైల్ నంబర్​కు వచ్చిన ఓటీపీని ఎటర్​ చేయడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది.


Also read: Flipkart Year End Sale: రూ.19,999 ధర గల Realme 8s 5g స్మార్ట్ ఫోన్ కేవలం రూ.549కే..త్వరపడండి!


Also read: Best Electric Cars : దేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు, వాటి ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook