EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్, మీ UAN ఇలా యాక్టివేట్ చేసుకోండి
How To Activate UAN | ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. అదే సమయంలో కంపెనీ సైతం అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఈపీఎఫ్ వివరాలు తెలుసుకోవాలంటే మీకు కావాల్సినవి యూనివర్సల్ అకౌంట్ నెంబర్(Universal Account Number).
How To Activate UAN | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు తన సేవల్ని అందిస్తోంది. దేశ వ్యాప్తంగా మొత్తం 6 కోట్లకు పైగా ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలున్నాయి. తద్వారా వడ్డీ ప్రయోజనం, పన్ను మినహాయింపులు, ఇన్సూరెన్స్, ఫించన్ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఈపీఎఫ్ఓ మీకు అందిస్తోంది.
ప్రతినెలా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. అదే సమయంలో కంపెనీ సైతం అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఈపీఎఫ్ వివరాలు తెలుసుకోవాలంటే మీకు కావాల్సినవి యూనివర్సల్ అకౌంట్ నెంబర్(Universal Account Number). ఇది 12 అంకెల యూనిక్ సంఖ్య. ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేస్తే మీ ఈఫీఎఫ్ ఖాతా వివరాలు మీకు కనిపిస్తాయి. మీ పీఎఫ్ నగదును కొన్ని పరిస్థితుల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగం మారిన సందర్భంలో కొత్త ఆఫీసు ఈపీఎఫ్ ఖాతాకు మీ నగదు సైతం బదిలీ చేసుకునే వెసలుబాటును ఈపీఎఫ్ఓ మీకు కల్పిస్తుంది. మీ యూఏఎన్ నెంబర్ అకౌంట్ చేసుకునే విధానం ఇక్కడ అందిస్తున్నాం. మీ యూఏఎన్ నెంబర్ ప్లే స్లిప్ ద్వారా తెలుసుకోవచ్చు.
Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ను ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోండి
స్టెప్ 1: మొదటగా ఈపీఎఫ్ఓ(EPFO) వెబ్‌సైట్ www.epfindia.gov.in.కు వెళ్లాలి
స్టెప్ 2: అందులో కనిపిస్తున్న Our Services విభాగంలో ఉన్న For Employees మీద క్లిక్ చేయండి
స్టెప్ 3: అనంతరం Member UAN / Online Services ఎంచుకోండి
స్టెప్ 4: అనంతరం కుడివైపున ఉన్న Important Links కిందివైపు ఉన్న Activate Your UAN ఆప్షన్‌ను క్లిక్ చేయండి
Also Read: EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం
స్టెప్ 5: మీ UAN, మీ పేరు, పుట్టినతేదీ, నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి
స్టెప్ 6: వివరాలు మొత్తం నమోదు చేసిన తరువాత Get Authorization Pin మీద క్లిక్ చేయండి
స్టెప్ 7: మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది
స్టెప్ 8: మీరు I Agree చెక్ బాక్స్ టిక్ చేసి, తరువాత ఓటీపీ ఎంటర్ చేయాలి
స్టెప్ 9: చివరగా Validate OTP and Active UAN ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీ యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది. ఇకపై మీరు ఈపీఎఫ్ ఖాతా వివరాలు చెక్ చేసుకోవడం తేలిక కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook