EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (Employee Provident Fund Organisation) ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నగదు నిల్వ, వడ్డీలు, పన్ను మినహాయింపు, పింఛన్ లాంటి పలు రకాల సౌకర్యాలను అందిస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 2019-20 ఏడాదికిగానూ ఈపీఎఫ్‌వో 8.5 శాతం వడ్డీని అందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్, పర్సనల్ లోన్‌ను తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో ఇంటి కోసం రుణాలు,  వ్యక్తిగత రుణాలు సైతం తీసుకోవడానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వెసలుబాటు కల్పించింది. EPF ఖాతాదారులు ఈ కింది పద్ధతిలో ఆన్‌లైన్ ద్వారా లోన్ పొందడవచ్చు.


Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మిస్డ్ కాల్ ద్వారా EPF Balance వివరాలు పొందవచ్చని తెలుసా


1) ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ EPFO Websiteలో యూఏఎన్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి


2) మేనేజ్ సెక్షన్ (Manage Section)కు వెళ్లాలి. అందులో ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ ఖాతా లాంటి KYC వివరాలు వెరిఫై చేసుకోవాలి.


3) ఆన్‌లైన్ సర్వీసెస్ (Online Services Section)కు వెళ్లాలి. అందులో CLAIM (Form – 31, 19, and 10C) ఆప్షన్ ఎంచుకోవాలి.


4) ఆ తరువాత ఈపీఎఫ్ ఖాతాదారుడి వివరాలు కనిపిస్తాయి. మీ బ్యాంక్ ఖాతాలో చివరి 4 అంకెలు నమోదు చేయాలి. ఆ తరువాత వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి


Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే


5) అనంతరం మీ వివరాలు మొత్తం నమోదు పూర్తయ్యాక Yes ఆప్షన్ ఓకే చేయాలి 


6) అనంతరం Proceed for Online Claim ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై I want to Apply For అప్షన్ మీద క్లిక్ చేయాలి. లోన్ తీసుకోవడానికి గల కారణాలు, ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తున్నారో తెలపాలి.


7) మొత్తం ప్రక్రియ పూర్తయిన తరువాత Employer ఆమోదం తెలిపితే అనంతరం 15 నుంచి 20 రోజుల్లోగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌కు నగదు ట్రాన్స్‌ఫర్ అవుతుంది.


Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook