EPFO: పీఎఫ్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. వడ్డీ రేటులో భారీ కోత
EPFO Interest Rates 2023: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. ఈపీఎఫ్ వడ్డీ రేటులో భారీ కోత పడనుంది. గత 43 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వడ్డీ పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో కోట్లాది మంది నష్టపోనున్నారు.
EPFO Interest Rates 2023: ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు త్వరలో షాక్ తగలనుంది. పీఎఫ్ వడ్డీ రేటుపై ఈ నెలలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌పై వడ్డీ మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. 43 ఏళ్ల తరువాత పీఎఫ్ ఖాతాదారులు అతి తక్కువ వడ్డీ పొందనున్నారని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2022-23 సంవత్సరానికి వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కోవిడ్ 19 కాలంలో ఎక్కువ మంది నగదు విత్ డ్రా చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఈపీఎఫ్ ఉపసంహరణ బాగా తగ్గింది. అదే సమయంలో ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే ఆదాయాలు కూడా పెరిగాయి. మార్చి 25, 26 తేదీల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల కీలక సమావేశం జరగనుండడంతో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మార్చి 2021లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించిని విషయం తెలిసిందే.
2016-2017 ఏడాదిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పీఎఫ్ వడ్డీ రేటును 8.65 శాతంగా నిర్ణయించగా.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.55 శాతంగా ఉంది. 2018-19లో మరోసారి 8.65 శాతానికి పెంచింది. 2019-20లో వడ్డీ రేటు 8.50 శాతం ఉండగా.. 2020-21లో ఇందులో ఎలాంటి మార్పు చేయాలేదు. 2021-22లో అది 8.10 శాతానికి తగ్గింది. గత నాలుగు దశాబ్దాల్లో ఇదే అత్యల్ప వడ్డీ రేటు ఇదే. 1977-78 సంవత్సరంలో వడ్డీ రేటు ఎనిమిది శాతంగా ఉండేది. ఈ ఏడాది కూడా అదే 8 శాతం వడ్డీ రేటుకు తగ్గించే అవకాశం కనిపిస్తోంది.
ఈ నెల 25, 26వ తేదీల్లో ఈపీఎఫ్ సమావేశం జరగనున్న నేపథ్యంలో వడ్డీకి సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతోపాటు ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పీఎఫ్‌పై వడ్డీని పెద్దగా తగ్గించే అవకాశం లేదు. అయితే గతేడాదితో పోలిస్తే తగ్గించే అవకాశం ఉంది. వడ్డీ రేటు తగ్గిస్తే.. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది ప్రత్యక్షంగా నష్టపోవాల్సి వస్తుంది.
ఈపీఎఫ్ఓ చాలా చోట్ల పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌లో జమ అయిన మొత్తాన్ని పెట్టుబడి పెడుతుంది. ఈ పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం వడ్డీ రూపంలో ఖాతాదారులకు తిరిగి చెల్లిస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లను కలిగి ఉన్న రుణ ఎంపికలలో 85 శాతం పెట్టుబడి పెడుతోంది. మిగిలిన 15 శాతం ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడతారు. లోన్, ఈక్విటీ ద్వారా వచ్చే ఆదాయాల ఆధారంగా పీఎఫ్ వడ్డీ నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌లో ఆరున్నర కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు.
Also Read: Urinated In American Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. మద్యం మత్తులో నిద్రపోతూ..
Also Read: Zoom Layoffs: జూమ్ సంచలన నిర్ణయం.. ఆకస్మికంగా అధ్యక్షుడికి ఉద్వాసన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook