ఈపీఎఫ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్స్ జారీ అవుతున్నాయి. ఈపీఎస్ పథకంలో భాగంగా ఉద్యోగులు అధిక పెన్షన్ అందుకునే సౌలభ్యం కూడా ఉంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం మార్చ్ 3 వరకూ అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదెలా చేయాలనే వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ ప్రకారం అధిక పెన్షన్ అర్హత ఉండి ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోకపోతే..ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. దీనికోసం ఉద్యోగి, యజమాని ఇద్దరూ సంయుక్తంగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 22, 2014లో పెన్షన్ జీతం పరిమితిని 6500 రూపాయల నుంచి 15 వేలకు పెరిగింది. 


జాయింట్ ఆప్షన్ ఫార్మ్‌కు సంబంధించి ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి సంబంధించి యూఆర్ఎల్ త్వరలో విడుదల చేయనుంది. యూఆర్ఎల్ విడుదలయ్యాక..ఈ విషయమై అందరికీ తెలిసేలా అవగాహన కల్పిస్తారు. ప్రతి దరఖాస్తు రిజిస్టర్ అవుతుందని..ప్రతి దరఖాస్తుదారునికి ఓ రిసీప్ట్ నెంబర్ ఇస్తామని ఈపీఎఫ్ఓ తెలిపింది. దరఖాస్తుల స్క్రూటినీ పూర్తయ్యాక, ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా సంబంధిత దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తారు. ఎవరెవరు ఉద్యోగులకు అధిక పెన్షన్ వస్తుంది, ఎలా అప్లై చేయాలనేది ఈపీఎఫ్ఓ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. 


ఈపీఎఫ్ ప్రకారం అధిక జీతం తీసుకునే ఉద్యోగులకే అధిక పెన్షన్ తీసుకునే అర్హత ఉంటుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 1, 2014 లోగా రిటైర్ అయిన ఉద్యోగులకు వర్తిస్తుంది. 


Also read: Jio vs Airtel 5G Plans: రోజూ 3GB డేటా ఇచ్చే ప్లాన్స్.. ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook