EPFO New Members: రికార్డుస్థాయిలో పెరిగిన EPFO సభ్యుల సంఖ్య.. ఒక్క నెలలోనే 13.95 లక్షల మంది చేరిక
Employee Provident Fund: ఈపీఎఫ్‌ఓ సభ్యుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. గతేడాది నవంబర్ నెలలో మొత్తం 13.95 లక్షల మంది చేరినట్లు EPFO పేరోల్ డేటా వెల్లడించింది. వీరిలో 10.67 లక్షల మంది సభ్యులు ఉద్యోగాలు మారినట్లు పేర్కొంది. కొత్తగా చేరిన సభ్యులలో 57.30 శాతం మంది 18-25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారే ఉన్నారని తెలిపింది.
Employee Provident Fund: గతేడాది నవంబర్ నెలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క నెలలోనే దాదాపు 13.95 లక్షల మంది ఈపీఎఫ్‌ఓలో చేరారు. వీరిలో 7.36 లక్షల మంది యువత ఉన్నారు. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సభ్యుల సంఖ్య ఎక్కువగానే ఉందని EPFO వెల్లడించింది. నవంబర్ నెలలో దాదాపు 7.36 లక్షల మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. కొత్తగా చేరిన సభ్యులలో అత్యధికంగా 18-25 సంవత్సరాల వయస్సు ఉన్న వారు 57.30 శాతం ఉన్నట్లు పేర్కొంది. దేశంలో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని.. సంఘటిత రంగంలో వారికి మంచి డిమాండ్ ఉందని చెప్పింది.
పేరోల్ డేటా ప్రకారం.. నవంబర్ నెలలో దాదాపు 10.67 లక్షల మంది సభ్యులు ఉద్యోగాలు మారారు. EPFO నుంచి ఎగ్జిట్ అయి.. కొత్త కంపెనీ నుంచి మళ్లీ చేరారు. అయితే వీరిలో ఎక్కువ మంది నగదు విత్ డ్రా చేసుకోకుండా.. ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు మొగ్గు చూపారు. నవంబర్ నెలలో మొత్తం 7.36 లక్షల మంది కొత్త సభ్యులు EPFO లో నమోదు చేసుకోగా.. వీరిలో దాదాపు 1.94 లక్షల మంది మహిళలు ఉన్నారు. దీంతో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య దాదాపు 2.80 లక్షలకు చేరింది. చందాదారుల వృద్ధిలో మహిళా సభ్యుల సంఖ్య 20.05 శాతంగా ఉందని డేటాలో ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. ఈ సంఖ్య గతేడాది సెప్టెంబర్ నెల కంటే ఎక్కువగా ఉందని.. సంఘటిత రంగ శ్రామికశక్తిలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం పెరుగుతోందని తెలిపింది.
కొత్తగా చేరిన సభ్యుల్లో ఎక్కువ మంది మహారాష్ట్ర నుంచి ఉండగా.. ఆ తరువాత తమిళనాడు, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 21.60 శాతం మంది కొత్త సభ్యులు EPFOలో నమోదు చేసుకున్నారు. వ్యవసాయ క్షేత్రాలు, కాఫీ తోటలు, చక్కెర, రబ్బరు తోటలు, టైల్స్ మొదలైన వాటిలో పనిచేసే సభ్యుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోందని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. కొత్త సభ్యుల్లో 41.94 శాతం మంది నిపుణుల సేవల విభాగంలో పనిచేస్తున్నారని.. మానవ వనరుల సరఫరా, కాంట్రాక్టు, భద్రతా సేవలు వంటి రంగాల్లో ఎక్కువ మంది చేరినట్లు వెల్లడించింది.
ఈపీఎఫ్‌ఓ డేటాను ప్రతి నెలా అప్‌డేట్ చేస్తున్న విషయం తెలిసిందే. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ద్వారా సభ్యుల సంఖ్యను ఈపీఎఫ్‌ఓ లెక్కిస్తుంది. ఈపీఎఫ్‌ఓలో తొలిసారిగా చేరిన సభ్యుల సంఖ్య, ఈపీఎఫ్‌ఓ నుంచి ఎగ్జిట్ అయి.. మళ్లీ చేరిన వారి సంఖ్యను ప్రతి నెలా రిలీజ్ చేస్తోంది.
Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్
Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter