EPFO New Rules: మారిన ఈపీఎఫ్ఓ రూల్స్.. చందాదారులకు తెలుసుకోవాల్సిన విషయాలివే..
EPFO New Rules: ఈపీఎఫ్ఓ చందారులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాలు రెండు భాగాలుగా విభజించనున్నారు. మరి ఈ ప్రభావం ఎవరిపై ఎలా ఉండనుంది? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO New Rules: బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) నిబంధనలల్లో పలు కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ ఖాతాలు రెండు భాగాలుగా విభజించే ప్రక్రియ అమలులోకి వచ్చింది. దీనితో ఈపీఎఫ్ఓ చందాలపై పన్ను విధించే విధానం అమలులోకి తెచ్చింది ప్రభుత్వం. దీనిపై ముఖ్యమైన సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఈపీఎఫ్ఓ చందాదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..
ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చిన కొత్త రూల్స్ ఈపీఎఫ్ఓ చందాదారాలందరికీ వర్తించవు.
ఇకపై ఈపీఎఫ్ఓ చందాదారుల వాటా.. వార్షికంగా రూ.2.5 లక్షలు దాటితే వారంతా పన్ను చెల్లించే పరిధిలోకి వస్తారు.
ఉద్యోగులు వాటా వార్షికంగా రూ.2.5 లక్షల కన్నా తక్కువగా ఉంటే.. వారంతా యథావిధంగా పన్ను చెల్లించా్సిన అవసరం లేదు.
బడ్జెట్ 2021కి ముందు వరకు ఈపీఎఫ్ఓ చందాదారులు.. తమకు కావాల్సినంత సేవ్ చేసుకుని పన్ను మినహాయింపు పొందేందుకు వీలుండేది.
పీఎఫ్ ఖాతాలో పరిమితికి మించి సేవింగ్స్ లేని సబ్స్క్రైబర్లు.. వార్షికంగా రూ.5 లక్షలకన్నా ఎక్కువగా సంపాదిస్తే మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పరిధికి మంచి పీఎఫ్ ఖాతాలో సేవింగ్స్ చేసే వారిని పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఐటీ రూల్స్‌లో సెక్షన్ 9డీని తెచ్చింది.
పన్ను పరిధిలోకి వచ్చే పీఎఫ్ చందాదారులను సులభంగా గుర్తించేందుకే.. పీఎఫ్ ఖాతాలను రెండు భాగాలుగా విభజించింది. ఇందులో ఒక ఖాతా రూ.2.5 లక్షలకన్నా తక్కువ సేవింగ్స్ ఉండే ఖాతాదారులకోసం కాగా.. మరో ఖాతా వార్షికంగా 2.5 లక్షల కన్నా ఎక్కువ సేవింగ్స్ చేసేవారికి వర్తిస్తుంది.
Also read: Moto G22: మోటో నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ప్రీమియం ఫీచర్లతో
Also read: Cardless withdrawal: కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా: ఆర్బీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook