Moto G22: మోటో నుంచి మరో బడ్జెట్ ఫోన్​.. ప్రీమియం ఫీచర్లతో

Moto G22: బడ్జెట్​ ధరలో మరో కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది మోటోరోలా. మోటో జీ22 పేరుతో ఈ కొత్త మోడల్​ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల విశేషాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2022, 05:44 PM IST
  • మోటోరోలా నుంచి బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​
  • ఆరంభం ఆఫర్​ కింద రూ.1,000 తక్షణ డిస్కౌంట్​
  • వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభం
Moto G22: మోటో నుంచి మరో బడ్జెట్ ఫోన్​.. ప్రీమియం ఫీచర్లతో

Moto G22: దేశంలో కొవిడ్ సంక్షోభం భారీగా తగ్గిన నేపథ్యంలో స్మార్ట్​ఫోన్​ తయారీ కంపెనీలు జోరు పెంచాయి. వరుసగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవాకు చెందిన మోటొరోలా.. నేడు బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్​ఫోన్​న్​ను విడుదల చేసింది. మోటో జీ22 పేరుతో విడుదల చేసిన ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మోటో జీ22 ఫీచర్లు..

ఈ ఫోన్​ను బడ్జెట్ ధరలో తెచ్చినప్పటికీ.. ప్రీమియం ఫీచర్లు పొందుపరచడం విశేషం. 6.53 అంగుళాల భారీ డిస్​ప్లేతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇది హెచ్​డీ ప్లస్​ (1600x720 పిక్సెల్​ రెసొల్యూషన్​) పిక్చర్ క్వాలిటీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్​తో ఈ ఫోన్ పని చేస్తుంది.

వెనకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. అందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్​తో రానుంది. మిగతా లెన్స్​లు 8 మెగా పిక్సెల్​, 2 మెగా పిక్సెల్​, 2 మెగా పిక్సెల్​గా ఉండనున్నాయి.

ఇందులో 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందు పరిచింది మోటోరోలా.

ఇక ఈ ఫోన్​లో 5000 ఎంఏహెచ్​ భారీ బ్యాటరీని పొందుపరిచింనట్లు చెప్పింది మోటోరోలా. ఇది 20 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ను సపోర్ట్​ చేస్తుంది.

ఆండ్రాయిడ్​ 12 స్టాక్​ ఆండ్రాయిడ్​పై పని చేస్తుంది. అంటే ఈ ఫోన్​లో యాడ్స్​ రావు.

ధర ఎంత?

4 జీబీ ర్యామ్​+64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధరను రూ.10,999గా నిర్ణయించింది కంపెనీ. అయితే ఆరంభ ఆఫర్​ కింద రూ.9,999కి తగ్గించింది. ఈ స్మార్ట్​ఫోన్ విక్రయాలు ఏప్రిల్ 13 నుంచి ఫ్లిప్​కార్ట్ ద్వారా ప్రారంభం కానున్నాయి.

Also read: Stock Markets: మూడు రోజుల నష్టాలకు బ్రేక్​- బ్యాంకింగ్ షేర్ల అండతో లాభాలు..

Also read: Google Play Store: ప్లేస్టోర్‌లో అప్‌డేట్ ఇవ్వని యాప్‌లకు గూగుల్ షాక్‌...!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News