UAN Card Download: ప్రభుత్వ ఉద్యోగి అయినా లేక ప్రైవేట్ ఉద్యోగి అయినా ప్రతి ఒక్కరికీ తప్పకుండా పీఎఫ్ ఎక్కౌంట్ ఉంటుంది. కంపెనీ మారినా సరే పీఎఫ్ వివరాలకు సంబంధించిన ఒకే యూఏఎన్ నెంబర్ కొనసాగుతుంది. అంటే యూనివర్శల్ ఎక్కౌంట్ నెంబర్. ఇప్పుడు యూఏఎన్ కార్డు కూడా అందుబాటులోకి వచ్చేసింది. మీరు సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన యూఏఎన్ నెంబర్ జారీ చేస్తుంది. ఆ వ్యక్తి పీఎఫ్ ఎక్కౌంట్ వివరాలన్నీ అందులో ఉంటాయి. ఉద్యోగం మారి వేరే కంపెనీకు వెళ్లినా అదే పీఎఫ్ ఎక్కౌంట్ కొనసాగేలా యూఏఎన్ నెంబర్ ఉపయోగపడుతుంది. యూఏఎన్ నెంబర్ ఉంటే పీఎఫ్ సంబంధిత అంశాలు లేదా సమస్యలన్నీ సులభంగా పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. ఆ ఉద్యోగి జీవితంలో ఎన్ని ఉద్యోగాలు మారినా సరే యూఏఎన్ నెంబర్ మాత్రం మారకుండా ఒకటే ఉంటుంది. 


పీఎఫ్ సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు లేదా ఇంట్లో కూర్చుని పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు యూఏఎన్ నెంబర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూఏఎన్ కార్డు కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని మీ వ్యాలెట్‌లో భద్రపర్చుకోవచ్చు. ఇది కూడా పాన్‌కార్డు, ఆధార్ కార్డు లాంటిదే. పీఎఫ్ సంబంధిత వివరాలన్నీ ఈ కార్డులో నిక్షిప్తమై ఉంటాయి.


యూఏఎన్ కార్డు డౌన్‌లోడ్ ఎలా


ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. మొదటి సారి అయితే ముందు యూఏఎన్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకుని పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ అయిన తరువాత  యూఏఎన్ కార్డు ఆప్షన్‌లో వ్యూ విభాగంలో వెళ్లాలి. ఇప్పుడక్కడ యూఏఎన్ కార్డు కన్పిస్తుంది. అంతే డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేస్తే మీ ఫోన్‌కు పీడీఎఫ్ రూపంలో వస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమంగ్ యాప్ ద్వారా కూడా యూఏఎన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


యాప్ ద్వారా యూఏఎన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఓటీపీ, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. యూఏఎన్ కార్డులో ఉద్యోగి యూఏఎన్ నెంబర్, పేరు, తండ్రి లేదా భర్త పేరు, కేవైసీ వివరాలు, క్యూఆర్ కోడ్ వంటివి ఉంటాయి.


Also read: Masked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook