Mobile Number Linking: ఈపీఎఫ్ఓ ఖాతాదారులైతే ఉమంగ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పీఎఫ్ సంబంధిత సమాచారం తెలుసుకోవచ్చు. అయితే మొబైల్ నెంబర్ పీఎఫ్ ఎక్కౌంట్‌కు అనుసంధానమై ఉండాలి. మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీటీ ద్వారా ధృవీకరించుకోవవల్సి  ఉంటుంది. మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉంటే మీ ఎక్కౌంట్‌లో ఏ లావాదేవీ జరిగినా మెస్సేజ్ వచ్చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం బ్యాంక్ ఎక్కౌంట్‌కే కాకుండా పీఎఫ్ ఎక్కౌంట్‌కు కూడా మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేయాలి. అప్పుడే అన్ని అప్‌డేట్స్ మీ ఫోన్ నెంబర్‌కు మెస్సేజ్ రూపంలో వస్తుంటాయి. ఎప్పుడైనా పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి అత్యవసరమై డబ్బులు విత్‌డ్రా చేయాల్సి వచ్చినా మొబైల్ నెంబర్‌కు ఓటీపీ ద్వారా ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ ఎక్కౌంట్‌లో ఏదైనా అప్‌డేట్స్ చేయాల్సి వచ్చినా మొబైల్ నెంబర్ అవసరమౌతుంది. 


పీఎఫ్ ఎక్కౌంట్‌కు మొబైల్ నెంబర్ లింక్ ఎలా చేయాలి


ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్  https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/.ఓపెన్ చేయాలి. ఇప్పుుడ మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఇప్పుడు మేనేజ్ టూల్‌పై క్లిక్ చేసి కాంటాక్ట్ వివరాల్లోకి వెళ్లాలి. మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ మొబైల్ నెంబర్ రెండు సార్లు ఎంటర్ చేయాలి. ఇప్పుడు గెట్ ఆధరైజేషన్ పిన్ క్లిక్ చేస్తే  4 అంకెల నెంబర్ జారీ అవుతుంది. ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి ధృవీకరించాలి. చివరిగా సేవ్ ఛేంజెస్ క్లిక్ చేయాలి. అంతే మీ మొబైల్ నెంబర్ యూఏఎన్ పోర్టల్‌లో అప్‌డేట్ అయినట్టే. 


Also read: PF Death Claim Rules: డెత్ క్లెయిమ్ నిబంధనల్లో మార్పులు చేసిన ఈపీఎఫ్ఓ, క్లెయిమ్ ఎలా సెటిల్ చేస్తారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook