PF Advance Rules: ఉద్యోగ సమయంలో కష్టపడి సంపాదించే డబ్బుల్నించి కొంత డబ్బు ప్రత్యేకం చేసి నెల నెలా దాచుతూ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత పెద్దమొత్తంలో డబ్బును అందుకోవడం. ఇదే ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ పథకం. అయితే ఎప్పుడైనా ఏదైనా అత్యవసరం అయినప్పుడు అడ్వాన్స్ విత్ డ్రాయల్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏదైనా అవసరం వచ్చినప్పుడు లేదా ఇళ్లు కొనాల్సిన పరిస్థితి లేదా పిల్లల చదువు కోసం , పెళ్లి ఖర్చులకు డబ్బులు అవసరమైతే పీఎఫ్ ఎక్కౌంట్‌లోంచి అడ్వాన్స్ తీసుకోవచ్చు. అయితే దీనికోసం పీఎఫ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి. ఎలాంటి అవసరాలకు పీఎఫ్ అడ్వాన్స్ డ్రా చేసుకోవచ్చు అనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం..


మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పీఎప్ డబ్బుల్ని అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. తన కోసం లేదా తన పిల్లలు, భార్య కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం నిమిత్తం వైద్య ఖర్చులకు పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. మెడికల్ ట్రీట్‌మెంట్, సర్జరీ, ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం ఈ డబ్బుల్ని తీసుకోవచ్చు. ఇక ఉద్యోగం చేసేటప్పుడు పీఎప్ విత్ డ్రాయల్ చేయాలంటే అవసరమైన నిర్దారిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అంటే మెడికల్ బిల్లులు, చెల్లింపు రసీదులు, లోన్ రీపేమెంట్ రసీదు, పెళ్లి కార్డు వంటివి జత చేయాల్సి ఉంటుంది.


ఇంటి రుణానికి సంబంధించి బాకీ చెల్లించేందుకు కూడా పీఎఫ్ నగదు అడ్వాన్స్ రూపంలో విత్ డ్రా చేయవచ్చు. ఇలా చేయాలంటే పీఎఫ్‌కు సంబందించి నిబంధనలున్నాయి. వాటి ప్రకారం వర్తిస్తుంది. అదే సమయంలో ఇంటి నిర్మాణం లేదా ఇంటి కొనుగోలు కోసం కూడా పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి కొంతమొత్తం నగదు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు.


మీ చదువు లేదా మీ పిల్లల చదువు ఖర్చుల కోసం డబ్బులు అవసరమైనప్పుడు పీఎఫ్ ఖాతాలోంచి అవసరమైన డబ్బులు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. ఇలా చేయాలంటే అడ్మిషన్ లేదా ఫీజు చెల్లింపు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక పిల్లల పెళ్లి ఖర్చులకు కూడా పీఎఫ్ నుంచి అడ్వాన్స్ తీసుకోవచ్చు. పెళ్లి కార్డు ఆధారంగా చూపించాల్సి వస్తుంది. దాంతోపాటు ఉద్యోగంలో మీ సర్వీస్ పరిగణలో తీసుకుంటారు. 


ఉద్యోగం మధ్యలో పీఎఫ్ అడ్వాన్స్‌గా తీసుకోవల్సి వస్తే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ఎందుకు కావాలనే ఆధార పత్రాలు సమర్పించడమే కాకుండా ఉద్యోగంలో నిర్ణీత కాలం పని చేసుండాలి. ప్రత్యేక అవసరం కోసం విత్ డ్రా చేసే డబ్బుకు గరిష్ట పరిమితి ఉంటుంది. 


Also read: Maruti Baleno: బాలెనో పై బంపర్ ఆఫర్ ప్రకటించిన మారుతి కంపెనీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook