EPFO Interest Credit: పీఎఫ్ ఖాతాల్లో జమ కానున్న 81 వేల రూపాయలు, ఎప్పుడు, ఎలాగో తెలుసుకోండి
EPFO Interest Credit: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. మీ ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. ఏకంగా 81 వేలవరకూ మీ ఖాతాలో డబ్బులు పడనున్నాయి. ఎలాగో చూద్దాం..
EPFO Interest Credit: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. మీ ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. ఏకంగా 81 వేలవరకూ మీ ఖాతాలో డబ్బులు పడనున్నాయి. ఎలాగో చూద్దాం..
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2022 ఆర్ధిక సంవత్సరపు వడ్డీ లెక్కలు పూర్తి చేసింది. త్వరలోనే ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ డబ్బులు జమ చేయనుంది. ఈపీఎఫ్ఓకు చెందిన 7 కోట్లమంది ఖాతాదారులకు ఈ నెలాఖరులోగా భారీగా డబ్బులు పడనున్నాయి. ఈపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్ల ఖాతాల్లో 2022 సంవత్సరపు వడ్డీను బదిలీ చేయనుంది. ఈసారి వడ్డీ 8.1 శాతం రానుంది.
గత ఏడాది వడ్డీ డబ్బుల కోసం 6-8 నెలల నిరీక్షించాల్సి వచ్చింది. గత ఏడాదంతా కరోనా మహమ్మారి ప్రభావముంది. ఈసారి ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరులోగా వడ్డీ మొత్తం జమ చేసేందుకు సిద్దమైంది. ఈసారి వడ్డీరేటు 40 ఏళ్ల కనిష్టంలో ఉంది.
మీ పీఎఫ్ ఖాతాలో 10 లక్షల రూపాయలుంటే వడ్డీ రూపంలో 81 వేలు లభిస్తాయి. ఒకవేళ మీ ఖాతాలో 7 లక్షల రూపాయలుంటే 56,700 రూపాయలు వస్తాయి. అదే మీ పీఎఫ్ ఖాతాలో 5 లక్షల రూపాయలుంటే..40,500 అందుతాయి. ఒకవేళ లక్ష రూపాయలుంటే మాత్రం 8వేల 100 రూపాయలు అందుతాయి.
పీఎఫ్ ఖాతాను చెక్ చేసేందుకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా 011-22901406 కు మిస్డ్‌కాల్ ఇచ్చి తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓకు మెస్సేజ్ పంపించడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ యూఏఎన్ నెంబర్, ఆధార్ నెంబర్, ప్యాన్ నెంబర్ లింక్ అయుండాలి.
ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ చెక్ ఎలా
ఆన్‌లైన్ విధానంలో బ్యాలెన్స్ చెక్ చేసేందుకు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in లాగిన్ కావాలి. ప్పుడు ఈ పాస్‌బుక్ క్లిక్ చేసి..యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్టా ఎంటర్ చేయాలి. వివరాలన్నీ ఇచ్చిన తరువాత మీ పాస్‌బుక్‌లో బ్యాలెన్స్ కన్పిస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ కోసం 7338299899 కు EPFOHO పంపించడం ద్వారా బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. హిందీలో తెలుసుకునేందుకు EPFOHO UAN టైప్ చేసి పంపించాలి.
Also read: Income tax Return: ట్యాక్స్ పరిధిలో లేకపోయినా ఐటీఆర్ ఫైల్ చేస్తే..కలిగే ప్రయోజనాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook