EPS 95 Pension Scheme : యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల పెన్షన్ సంస్కరణల తర్వాత , ఇప్పుడు ప్రైవేట్,ప్రభుత్వ కార్పొరేషన్ త్వరలోనే గుడ్ న్యూస్ అందనుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) కింద ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ కంట్రిబ్యూషన్ లెక్కింపు కోసం వేతన పరిమితిని పెంచాలని ప్రతిపాదనలు ఉన్నాయి. కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి అందిన ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనలో కార్మిక మంత్రిత్వ శాఖ వేతన పరిమితిని ప్రస్తుత రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచాలని సిఫారసు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ కోసం వేతన పరిమితిని పెంచడమనే ప్రతిపాదన ఏప్రిల్‌లో ఆర్థిక శాఖకు పంపించింది.అయితే  ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ నిర్వహించే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)లో పెన్షన్‌ను లెక్కించడానికి వేతన పరిమితి రూ.15,000 సెప్టెంబర్ 1, 2014 నుండి అమలులోకి వచ్చేలా ప్రతిపాదన చేశారు. అయితే ఈ ప్రతిపాదిత పెంపుదల ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.21,000కి పెంచాలన్న ప్రతిపాదన ఆమోదం పొందితే, అది ప్రైవేట్ రంగ ఉద్యోగుల పెన్షన్, ఈపీఎఫ్ విరాళాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.


Also Read : Gold and Silver Rates Today : తగ్గిన బంగారం-వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే ?


EPS పెన్షన్ ఎలా లెక్కిస్తారు? 


EPS పెన్షన్‌ను లెక్కించడానికి ప్రత్యేక ఫార్ములా ఉపయోగిస్తారు. ఈ ఫార్ములా ఏమిటంటే- సగటు జీతం x పెన్షనబుల్ సర్వీస్/ 70. ఇక్కడ సగటు జీతం అంటే ఉద్యోగి 'ప్రాథమిక జీతం' + 'డియర్‌నెస్ అలవెన్స్' అని అర్థం. అంతేకాకుండా, గరిష్ట పెన్షన్ సేవ 35ఏండ్లు. ప్రస్తుత వేతన పరిమితి (పెన్షనబుల్ జీతం) రూ.15,000. ఇప్పుడు మనం ఈ గణాంకాలతో లెక్కిస్తే, ప్రస్తుత EPS పెన్షన్ నెలకు 15,000 x 35 / 70 = రూ. 7,500.


చేతికి వచ్చే జీతం తగ్గుతుంది:


వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.21,000కి పెంచితే ఉద్యోగులకు నెలకు రూ.21,000 x 35/70 = రూ.10,050 పెన్షన్ అందుతుంది. అంటే న్యూ రూల్స్ ప్రకారం.. ఉద్యోగులకు ప్రతి నెలా రూ.2550 అదనపు పెన్షన్ లభిస్తుంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, కొత్త నిబంధనల తర్వాత, ఉద్యోగుల జీతంలో స్వల్ప తగ్గుదల ఉంటుంది. ఎందుకంటే కొత్త నిబంధనల అమలు తర్వాత, ఈపీఎఫ్, ఈపీఎస్ కోసం మరింత తగ్గింపు ఉంటుంది.


Also Read : Senior Citizen Saving Scheme: రిటైర్‎మెంట్ తర్వాత నెలకు రూ. 20 వేల పెన్షన్ కావాలా.. అయితే ఈ స్కీంలో చేరండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.