Senior Citizen Saving Scheme: రిటైర్‎మెంట్ తర్వాత నెలకు రూ. 20 వేల పెన్షన్ కావాలా.. అయితే ఈ స్కీంలో చేరండి

SCSS: రిటైర్మెంట్ తర్వాత పెన్షనే జీవన ఆధారంగా ఉంటుంది. అందుకే రిటైర్మెంట్ ప్లాన్ వేసుకున్నప్పుడే మలి వయస్సులో ఆర్థిక భద్రత కోసం నెలనెలా కొంత ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి.మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 20వేల పెన్షన్ పొందాలనుకుంటే ఈ స్కీములో చేరండి. ఆ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Aug 27, 2024, 02:19 PM IST
Senior Citizen Saving Scheme: రిటైర్‎మెంట్ తర్వాత నెలకు రూ. 20 వేల పెన్షన్ కావాలా.. అయితే ఈ స్కీంలో చేరండి

Senior Citizen Saving Scheme:  ఉద్యోగం చేస్తున్న సమయంలోనే మంచి పెన్షన్ పాలసీని ఎంచుకోవాలి. వాటిలో క్రమం తప్పకుండా పొదుపు చేస్తుండాలి. దీని వల్ల రిటైర్మెంట్ తర్వాత భారీ మొత్తం డబ్బులు చేతికి వస్తాయి. పైగా పెన్షన్ కూడా వస్తుంది.రిటైర్మెంట్ తర్వాత హామీతో కూడిన పెన్షన్ ఇచ్చే స్కీములను చాలా బీమా సంస్థలు ఇస్తున్నాయి. అయితే వీటిని ఎంచుకొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్కీము గురించి తెలుసుకుందాం. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పథకం ఇతర పొదుపు స్కీముల కంటే ఎక్కువ శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అంటే ఏమిటి?

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది భారతదేశంలో ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించిన డిపాజిట్ పథకం. ఈ స్కీము ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఈ స్కీములో పెట్టుబడి పెడితే ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. హామీ ఇచ్చే వడ్డీ రేటుతో సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడి కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్‌లకు SCSS మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. 

ఈ ఖాతాను ఎవరు తెరవగలరు?

ఈ ఖాతాను తీసుకోవాలంటే 60ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తి లేదా  55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి, సూపర్‌యాన్యుయేషన్, VRS లేదా ప్రత్యేక VRS కింద పదవీ విరమణ చేసిన వ్యక్తి, ఈ ఖాతాను తీసుకోవచ్చు. 

డిఫెన్స్ సర్వీసెస్ రిటైర్డ్ సిబ్బంది (సివిలియన్ డిఫెన్స్ ఉద్యోగులు మినహా) ఇతర పేర్కొన్న షరతుల  లోబడి యాభై సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత కూడా ఖాతాను తెరవవచ్చు.డిపాజిటర్ వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో జాయింట్ అకౌంట్ ను తెరవవచ్చు. ఉమ్మడి ఖాతాలో డిపాజిట్ మొత్తం మొదటి ఖాతాదారుకు మాత్రమే చెందుతుంది. 

ఈ ఖాతాను ఎలా తెరవాలి?

SCSS ఖాతాను సీనియర్ సిటిజన్ బ్యాంకు లేదా పోస్టాఫీసులో తెరవవచ్చు. ఖాతాను తెరవడానికి, వారు గరిష్టంగా రూ. 30 లక్షల డిపాజిట్‌తో దాని గుణకాలలో కనీస డిపాజిట్ రూ. 1000 ఉండేలా చూసుకోవాలి. రూ. 1000/- గరిష్టంగా రూ. 30 లక్షలకు మించకుండా ఖాతాలో ఒక డిపాజిట్ మాత్రమే ఉంటుంది. అకౌంట్ నుంచి మల్టీపుల్ ట్రాన్సాక్షన్లు చేయకూడదు.

Also Read : Gold and Silver Rates Today : తగ్గిన బంగారం-వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే ?

 ట్యాక్స్ బెనిఫిట్:

SCSSలో డిపాజిట్లు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. 

 వడ్డీ రేటు:

సెప్టెంబర్ 30, 2024తో ముగిసే త్రైమాసికంలో, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు సంవత్సరానికి 8.2శాతం , త్రైమాసికానికి చెల్లిస్తారు. వడ్డీ డిపాజిట్ తేదీ నుండి మార్చి 31/ 30 జూన్/30 సెప్టెంబర్/31 డిసెంబర్ వరకు ఏప్రిల్/జూలై/అక్టోబర్/జనవరి 1వ పని రోజున చెల్లిస్తారు. మొదటి సందర్భంలో, ఆ తర్వాత, వడ్డీ చెల్లించాలి ఏప్రిల్/జూలై/అక్టోబర్/జనవరి 1వ పని దినం.ఖాతా తెరిచిన తేదీ నుండి 5 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత ఖాతాను మూసివేయవచ్చు. డిపాజిటర్ ఖాతాను మరో 3ఏండ్లపాటు పొడిగించుకోవచ్చు.

ప్రస్తుతం, ఈ పథకం SCSSని ఎంచుకునే వారికి 8.2 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. అందువల్ల, ఎవరైనా సుమారు రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే, వారు రూ. 2.46 లక్షల వార్షిక వడ్డీని పొందుతారు. ఇది నెలకు దాదాపు రూ. 20,000వేలకు వరకు పెన్షన్ రూపంలో పొందవచ్చు.

Also Read : PM Kisan Yojana : రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News