Investment Tips: నేటికాలంలో చాలా మంది భవిష్యత్ భరోసా గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, బంగారం పెట్టుబడి, స్టాక్ మార్కెట్లు ఇలా ఎన్నో రకాలను ఎంచుకుంటారు. అయితే హైరిటర్న్స్ అందించే వాటిని ఎంచుకుని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని చెబుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు. సంప్రదాయ పొదుపు స్కీంలలో స్థిరమైన రాబడి అందుతుంది.  రిస్క్ ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లలో హైరిటర్న్స్ ను పొందవచ్చు. అయితే చాలా మంది రిస్క్ ఎందుకు అనుకుంటారు. అలాంటి వారి కోసం మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. స్టాక్ మార్కెట్లతో పోల్చితే వీటిలో ఎలాంటి రిస్క్ ఉండదు.  సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో తమ డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోటీశ్వరులు అవ్వాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో అర్థం కాదు. అలాంటి వారికి తక్కువ పెట్టుబడితోనే మీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం వీలుకాని వారు నెలనెలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు మీరు సిప్ లో పెట్టుబడి పెట్టుకుంటూ పోతే ఎన్నో రెట్లు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లోకాంపౌండింగ్ మ్యాజిక్ చేస్తుంది. అంటే వడ్డీకి వడ్డీ జమ అవుతూ మీ కార్పస్ స్పీడప్ అవుతుంది.  ప్రతి నెలా కేవలం రూ. 5,000 పొదుపు చేయడం ద్వారా కోటీశ్వరులు కావడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


Also Read: Mukesh Ambani Highest paid salary :  ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఎవరో తెలుసా?


మ్యూచువల్ ఫండ్స్  ప్రయోజనాలు:


దీర్ఘకాలంలో పెద్ద కార్పస్‌ను నిర్మించడానికి మ్యూచువల్ ఫండ్‌లు అత్యంత ప్రభావవంతంగా సహాయపడతాయి. ఎందుకంటే  మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ పెడితే మంచి రాబడిని పొందడమే కాదు అద్భుతమైన ప్రయోజనాలను కూడా పొందుతారు. మీరు దీర్ఘకాలం  పెట్టుబడిని కొనసాగించినట్లయితే మీరు అనుకున్న రాబడిని పొందవచ్చు. 


రూ. 5,000 SIPతో కోటీశ్వరులు కావడానికి ఎంత సమయం పడుతుంది?


మీ జీతం ఎక్కువ కాకపోయినా నెలకు రూ. 5,000 ఆదా చేస్తే చాలు.  ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ SIP లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు కోటీశ్వరులు  కావచ్చు . ఆన్‌లైన్ SIP కాలిక్యులేటర్ ద్వారా లెక్కించిన తర్వాత, మీరు ప్రతి నెలా రూ. 5,000 ఇన్వెస్ట్ చేస్తే , దానిపై మీరు 12 శాతం వార్షిక వడ్డీని అంచనా వేస్తే, మీరు 26 సంవత్సరాలలో రూ. 1 కోటిరూపాయలు మీ చేతికి అందుతాయి. మీరు రూ. 5000 పెట్టుబడిపై సంవత్సరానికి 15 శాతం వడ్డీని అంచనా వేస్తే, రూ. 1 కోటి జమ కావడానికి 22 ఏళ్లు పడుతుంది. మీరు 18 శాతం వడ్డీని పొందినట్లయితే, మీరు 19 నుండి 20 సంవత్సరాల తర్వాత కోటీశ్వరులు కావచ్చు. 


Also Read: Repo Rate : కీలక వడ్డీరేట్లలో మార్పులు లేవు..రుణగ్రహీతలకు లభించని ఊరట..!!


మ్యూచువల్ ఫండ్లలో మార్కెట్ రిస్క్:


మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు అందులో మార్కెట్ రిస్క్ ఉంటుందన్న విషయాన్ని  గుర్తుంచుకోవాలి. అదనంగా, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై వచ్చే రాబడి మూలధన లాభాల కిందకు వస్తుంది.  మీరు దానిపై పన్ను చెల్లించాలి.


Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter